వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి ఏపీ సీఎం లేఖ.. సామాన్యుల కోసం జగన్ చేసిన స్పెషల్ రిక్వెస్ట్ ఏమిటంటే!!

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధానంగా వంటనూనెల పైన లేఖలో ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి ఆవనూనె పై దిగుమతి సుంకం తగ్గించాలని లేఖ రాశారు.

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ కు జగన్ లేఖ

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ కు జగన్ లేఖ

విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇక ఇటీవల చోటుచేసుకున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలో నూనెల ధరలు తగ్గించడానికి కేంద్రం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తన విజ్ఞప్తి గా ఆవనూనె దిగుమతిపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, పీయూష్ గోయల్ కు ఆయన రాసిన లేఖలో రాష్ట్రంలో వంటనూనెల కొరత నెలకొందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏడాది పాటు ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .

వంట నూనెల కొరత వల్ల వినియోగదారులపై ప్రభావం

వంట నూనెల కొరత వల్ల వినియోగదారులపై ప్రభావం

2021-2022లో దేశంలో వంట నూనెల వినియోగం 240 మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 40 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయిందని, మిగిలిన 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. దిగుమతి చేసుకుంటున్న వంటనూనెలలో 95శాతం పామాయిల్ ను ఇండోనేషియా, మలేషియా నుండి 92% సన్ ఫ్లవర్ ఆయిల్ ను రష్యా, ఉక్రెయిన్ ల నుండి దిగుమతి చేసుకుంటున్నామని జగన్ తెలిపారు. ఉక్రెయిన్ రష్యా లో పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో వంటనూనెల కొరత ఏర్పడిందని, దీని వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ లేఖలో పేర్కొన్నారు.

వంట నూనెల కొరత కారణంగా పెరిగిన ధరలు

వంట నూనెల కొరత కారణంగా పెరిగిన ధరలు

తాజా పరిణామాల నేపథ్యంలో సన్ ఫ్లవర్ ఆయిల్ తో పాటు ఇతర వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయని జగన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువమంది సన్ ఫ్లవర్ ఆయిల్ వాడతారని, దాని తర్వాత 28 శాతం మంది పామాయిల్ ను వాడతారని, ఆ తర్వాత కేవలం 4.3 శాతం మంది వేరుశనగ నూనెను వాడతారని పేర్కొన్న సీఎం జగన్ మార్కెట్లో వంటనూనెల సరఫరాకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్, తూనికలు కొలతల శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక వంటనూనెల సమస్య లేకుండా చేయడం కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశామని జగన్ లేఖలో తెలిపారు.

ఆవనూనె సన్ ఫ్లవర్ ఆయిల్ కు ప్రత్యామ్నాయం.. సుంకాలు తగ్గిస్తే దిగుమతికి ఛాన్స్

ఆవనూనె సన్ ఫ్లవర్ ఆయిల్ కు ప్రత్యామ్నాయం.. సుంకాలు తగ్గిస్తే దిగుమతికి ఛాన్స్


ఇక ఆవనూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ లానే ఉంటుందని, ప్రస్తుతం ముడి ఆవనూనె పై 38.5% శుద్ధిచేసిన ఆవనూనె పై 45 శాతం దిగుమతి సుంకం ఉందని, ఇది దిగుమతి చేసుకోవడానికి ప్రతిబంధకంగా మారింది అని జగన్ పేర్కొన్నారు. వినియోగదారుల ఇబ్బందుల దృష్ట్యా కనీసం ఏడాది పాటు ఆవనూనె పై దిగుమతి సుంకాలను తగ్గించాలని జగన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

English summary
AP CM Jagan wrote a letter to Union Ministers Nirmala Sitharaman and Piyush Goyal. Jagan said in the letter that the import duty on mustard oil should be reduced for a year due to shortage of cooking oils.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X