ఏపీలో జగన్ జనాదరణ తగ్గిందా- జాతీయ స్థాయిలో బెస్ట్ : ఎందుకు- సర్వే చెప్పిన వాస్తవాలు..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్. సీఎం అయ్యే వరకూ దాదాపు పదేళ్ల పాటు నిత్యం ప్రజల్లో ఉండేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. 2014 లో కొద్ది పాటి శాతం ఓట్లతో మిస్ అయిన అధికారం 2019 లో సాధించారు. సీఎం పగ్గాలు చేపట్టి 26 నెలలు అవుతోంది. సంక్షేమం పేరుతో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సీఎం జగన్ ఒక్కరే. ఏపీలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఇటువంటి సమయంలో ఏపీలో సీఎం జగన్ జనాదరణ చెక్కు చెదరలేదనే అభిప్రాయం నెలకొని ఉంది.

జగన్ జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎంగా నాలుగో స్థానంలో..

జగన్ జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎంగా నాలుగో స్థానంలో..

ఈ సమయంలోనే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే చేసింది. అందులో చెబుతున్న విషయాలు ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో జగన్ నాలుగో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాద్, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మూడో స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉండగా, నాలుగో స్థానంలో ఏపీ సీఎం జగన్ నాలుగో స్థానంలో 6 శాతం మద్దతుతో నిలిచారు. ఇక, ఆ తరువాతి స్థానంల్లో వరుసగా నితీశ్ కుమార్, ఉద్దవ్ థాక్రే, నవీన్ పట్నాయక్ నిలిచారు.

 స్వరాష్ట్రం పాపులారిటీలో దొరకని స్థానం..

స్వరాష్ట్రం పాపులారిటీలో దొరకని స్థానం..

అయితే, ముఖ్యమంత్రులుగా పని చేస్తున్న వారి రాష్ట్రాల్లో వారి ప్రజాదరణ పైన కూడా సర్వే చేసారు. 'స్వరాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులు' (మోస్ట్‌ పాపులర్‌ సీఎమ్స్‌ ఇన్‌ దెయిర్‌ హోమ్‌ స్టేట్స్‌) అనే ఈ జాబితా లో మాత్రం జగన్ వెనుకబడి ఉన్నారు. తొలి స్థానంలో ఎంకే స్టాలిన్‌ (తమిళనాడు), రెండో స్థానంలో నవీన్‌ పట్నాయక్‌ (ఒడిసా) , మూడో స్థానంలో పినరయి విజయన్‌ (కేరళ) , నాలుగో స్థానంలో ఉద్ధవ్‌ ఠాకరే (మహారాష్ట్ర) , అయిదో స్థానంలో మమతా బెనర్జీ (బెంగాల్‌) , ఆరో స్థానంలో హిమంత విశ్వ శర్మ (అసోం), ఏడో స్థానంలో యోగి ఆదిత్యనాథ్‌ (యూపీ) , ఎనిమిదో స్థానంలో అశోక్‌ గోహ్లోత్‌ (రాజస్థాన్‌), తొమ్మిదో స్థానంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఢిల్లీ) , పదో స్థానంలో హేమంత్‌ సోరెన్‌ (జార్ఖండ్‌), పదకొండో స్థానంలో భూపేశ్‌ (ఛత్తీస్ గఢ్‌) నిలిచారు.

 జాతీయ స్థాయిలో నిలిచి..స్వరాష్ట్రంలో ఇలా..సాధ్యమేనా..

జాతీయ స్థాయిలో నిలిచి..స్వరాష్ట్రంలో ఇలా..సాధ్యమేనా..

అయితే, జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో నెంబర్ ఒన్ స్థానంలో నిలిచిన యూపీ సీఎం యోగి.. స్వరాష్ట్రంలో చేసిన సర్వేలో ఏడో స్థానంలో నిలిచారు. అదే విధంగా జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో ఉన్న జగన్.. స్వరాష్ట్రంలో అసలు టాప్ టెన్ లో లేకుండా ఎలా సాధ్యమనే ప్రశ్న మొదలైంది. నవరత్నాల అమలు..హామీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనే సంకల్పంతో ఆర్దికంగా కష్టాలు ఉన్నా..అప్పులు చేసి సంక్షేమం పేరుతో పధకాలను కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో స్వరాష్ట్రంలో జగన్ పాపులారిటీ తగ్గిందనే సర్వే లెక్కలు వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు.

 సంక్షేమం-రాజకీయంగా పై చేయి సాధించినా..

సంక్షేమం-రాజకీయంగా పై చేయి సాధించినా..

జాతీయ స్థాయిలో స్థానం దక్కించుకొని...స్వరాష్ట్రంలో స్థానం లేకపోవటం పైన వైసీపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాజకీయంగా తిరుగు లేదనే విధంగా ముందుకు వెళ్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రెండు జాబితాల్లోనూ స్థానం దక్కలేదు. ఏపీలో ప్రతిపక్షం సైతం బలహీన పడిందని చెబుతున్న..ఈ సమయంలో జగన్ కు స్వరాష్ట్రంలో పాపులారిటీ తగ్గిందనే విధంగా ఉన్న ఈ సర్వేనే..జాతీయ స్థాయిలో మాత్రం మంచి ర్యాంకింగ్ ఇచ్చింది. దీంతో..ఇప్పుడు ఈ సర్వేకు సంబంధించి అనేక రకాలు చర్చలు రాజకీయంగా మొదలయ్యాయి.

 ప్రధాని మోదీ డౌన్ అయినా..తిరుగులేదంటూ..

ప్రధాని మోదీ డౌన్ అయినా..తిరుగులేదంటూ..

ఇక, జాతీయ రాజకీయాల్లో ఏడాది జనవరికే మోదీ పాపులారిటీ 66 శాతం నుంచి 38 శాతానికి పడిపోగా.. ఇప్పుడది మరింత క్షీణించి 26 శాతానికి చేరింది. అయినప్పటికీ దేశ ఉత్తమ ప్రధానిగా 24 శాతం మంది ఆయనవైపే మొగ్గుచూపారు. తర్వాతి స్థానంలో (11%) యోగి ఆదిత్యనాథ్‌ నిలిచారు. మూడో స్థానంలో (10%) ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పాపులారిటీ గత ఏడాదితో పోల్చితే రెండు శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. ప్రజాదరణ తగ్గినప్పటికీ అత్యుత్తమ ప్రధాని మోదీయేనని 27 శాతం మంది పేర్కొన్నారు. అటల్‌ బిహారీ వాజపేయి (19%) ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. అలాగే ప్రధానిగా మోదీ స్థానాన్ని భర్తీచేసే సత్తా అమిత్‌షాకు మాత్రమే ఉందని 29% మంది అభిప్రాయపడగా.. 19 శాతం మంది యోగికి మద్దతుగా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+