• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలించిన సీఎం జగన్ మంత్రాంగం : తాను కోరుకున్న విధంగానే : ఆ నాలుగు పేర్లకే గవర్నర్ ఆమోదం ..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన అనుకున్న విధంగానే తన నిర్ణయానికి ఆమోదం పొందేలా వ్యవహరించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు ముందు ఈ నెల 11వ తేదీన పదవీ విరమణ చేసిన నలుగురు నామినేటెడ్ కోటా ఎమ్మెల్యే స్థానంలో కొత్తగా వైసీపీ నుండి నలుగురికి ఎంపిక చేసారు. అందులో సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుండి కడప జిల్లా నుండి బీసీ వర్గానికి చెందిన రమేష్ యాదవ్ ను ఎంపిక చేయగా .. గుంటూరు జిల్లా నుండి లేళ్ల అప్పిరెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక, పశ్చిమ గోదావరి నుండి ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యా మోషేన్ రాజు పేరు సిఫార్సు చేసారు. ఇక, తూర్పు గోదావరి నుండి సీనియర్ నేత తోట త్రిమూర్తుల పేరును నామినేటెడ్ కోటా లో ఆమోదించాల్సిందిగా గవర్నర్ కు ప్రభుత్వం సిఫార్సు చేసింది.

గవర్నర్ వద్ద పెండింగ్ ..

గవర్నర్ వద్ద పెండింగ్ ..

అయితే, గవర్నర్ కోటాలో నియామకాలు కావటంతో ..ఈ నలుగురి బయోడేటాలను గవర్నర్ నిశితంగా పరిశీలించారు. రమేష్ యాదవ్..మోషేన్ రాజు పేర్ల పైన అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ, మరో ఇద్దరు తోట త్రిమూర్తులు..లేళ్ల అప్పిరెడ్డి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావటంతో గవర్నర్ పెండింగ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వారి పైన కేసులు పెండింగ్ లో ఉన్నాయని..వారి పేర్లకు ఆమోద ముద్ర వేయవద్దంటూ ఫిర్యదులు వచ్చినట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరికి చెందిన తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదై ఉంది. అప్పిరెడ్డిపై పలు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు. సాధారణంగా గవర్నర్ కోటాలో నియమితలయ్యే వారు వివాదాలకు..ఆరోపణలకు దూరంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో.. ఈ ఇద్దరి పైన సమాచారం సేకరించిన రాజ్ భవన్ వర్గాలు ఈ విషయాన్ని ప్రభుత్వానికి వివరించాయి.

 ముఖ్యమంత్రి మంత్రాంగం..

ముఖ్యమంత్రి మంత్రాంగం..


దీంతో..ముఖ్యమంత్రి ఈ సాయంత్రం సమావేశమై వారిద్దరి పైన ఉన్న కేసులు..అభ్యంతరాలకు వివరణ ఇస్తారని ప్రచారం సాగింది. కానీ, ముఖ్యమంత్రి రాజ్ భవన్ లో గవర్నర్ అప్పాయింట్ మెంట్ తీసుకున్న తరువాత..కాసేపట్లో గవర్నర్ ను కలిసే సమయంలోనే ఈ నలుగురి పేర్లకు గవర్నర్ బిశ్వ భూషణ్ ఆమోదం తెలిపారు. దీంతో..సతీ సమేతంగా రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం జగన్ అక్కడ గవర్నర్ కు నాలుగు పేర్లకు ఆమోదం తెలిపినందుకు దన్యవాదాలు తెలిపారు. దాదాపు 40 నిమిషాల పాటు రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటన..కోవిడ్ నివారణ..మూడు రాజధానుల అంశం పైన గవర్నర్ తో చర్చించినట్లు గా తెలుస్తోంది. ఇక, ఈ నాలుగు పేర్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేయటంతో ఈ వ్యవహారం ఎటువంటి వివాదం లేకుండా ముగిసిపోయింది.

Recommended Video

Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.

గవర్నర్ ఆమోదం

ఈ నాలుగు పేర్లతో అధికారికంగా గజిట్ విడుదల కానుంది. ఆ తరువాత నలుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నలుగురిలో మోషేన్ రాజు..అప్పిరెడ్డి వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పని చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇద్దరికీ పోటీ చేసేందుకు అవకాశం రాకపోవటంతో వారి స్థానాలు వేరే వారికి కేటాయించటంతో..వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని అప్పట్లోనే జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు అది నెరవేర్చారు. ఇక, కడప జిల్లాకు చెందిన రమేష్ యాదవ్ ప్రస్తుతం ప్రొద్దుటూరు కౌన్సిలర్ గా ఉన్నారు. ఇక, తూర్పు గోదావరికి చెందిన తోట త్రిమూర్తులు 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి రామచంద్రాపురం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ప్రస్తుత మంత్రి వేణు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. జిల్లా సమీకరణాలు..సీనియర్ నేత..బలమైన కాపు నేతగా గుర్తింపు ఉన్న త్రిమూర్తులను సైతం సామాజిక సమీకరణాల్లో భాగంగా జగన్ శాసన మండలికి నామినేటెడ్ కోటాలో ఎంపిక చేసారు.

English summary
AP Governor Biswabhushan Harichandan had given a nod to the four nominated MLC's shortlisted by govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X