ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు.. ప్రత్యామ్నామ పంటకు ప్రత్యేక బోనస్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

పంటల కొనుగోళ్లు, మద్దతు ధర, ప్రత్యామన్నాయ పంటలకు ప్రొత్సాహంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకూడదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశ్రీలక ప్రాత పోషించాలని పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల, మద్దతు ధర , రైతులకు అందిస్తున్న సేవలపై ప్రత్యేక సమీక్ష‌ నిర్వహించారు.

ఆర్బికేల‌దే కీల‌క పాత్ర‌

ఆర్బికేల‌దే కీల‌క పాత్ర‌

ఈసందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులు పండించిన పంటలకు ఎంఎస్పీ ధర లభించాలని సూచించారు. తమ ప్రభుత్వం వ్యవసాయానిపెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. ప్రతి పంటలకు మద్దతు ధర రావడం అన్నది ప్రభుత్వ లక్ష‌మని జగన్ స్పష్టం చేశారు. పంటల కొనుగోళ్లతో ఆర్బీకేలు క్రియాశీల ప్రాత పోషించాలన్నారు. ప్రతి ఆర్బీకేలో కనీసం ఐదుగురు సిబ్బంది ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండాలన్నారు. వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి .. వారితో సంప్రదింపులు జరిపి కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని ఆదేశించారు. రవాణా వాహనాలు, గన్నీ బ్యాగులు, హమాలీలను ఈ ఐదుగురు సిబ్బందే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని స్పష్టం చేశారు.

 రైతుల‌తో మ‌మేకం

రైతుల‌తో మ‌మేకం


రైతులకు సేవలందిండంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఎక్కడా సమాచార లోపం ఉండకూడదని తెలిపారు. తరచూ రైతులతో మమేకం కావాలని సూచించారు. రంగుమారినా, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేదని విధంగా ప్ర‌భుత్వ‌మే ధాన్నాన్ని చేస్తుంద‌ని తెలిపారు.

 ధాన్యం కొనుగోళ్ల‌లో మిల్ల‌ర్ల పాత్ర వ‌ద్దు

ధాన్యం కొనుగోళ్ల‌లో మిల్ల‌ర్ల పాత్ర వ‌ద్దు


రైతుల పండించిన ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదని జగన్ ఆదేశించారు. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలన్నారు. ధాన్యం నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దీంతో రైతులకు అన్నివిధాల మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

 21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ‌

21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ‌

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని .. పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.

 ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచండి..

ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచండి..

ప్రతి ఆర్బీకే సెంటర్ లో ఫిర్యాదుల కోసం ఒక నంబర్ పెట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. పంటల కొనుగోలుపై రైతుల నుంచే వచ్చే ఫిర్యాదులను , విజ్ఞాప‌నల సీరియస్ తీసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. జిల్లాల్లో ఉన్న జేసీ నుంచి కూడా పంటల కొనుగోలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకోలని చెప్పారు. సీసీఆర్సీ కార్డ్స్ పై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో రోజుకు సగటున 42,237 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. దీనిని రానున్నా రోజుల్లో మరింత పెంచాల‌ని జ‌గ‌న్ సూచించారు.

 ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక ప్రొత్సాహం

ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక ప్రొత్సాహం

రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపేలా రైతులను ప్రొత్సహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇలా పంటలు పండించేవారికి ప్రత్యేక బోనస్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటలు కొనుగోలు బాధ్యత కూడా ప్రభుత్వమే చేపడుతున్న విషయాన్ని రైతులకు వివరించాలన్నారు. రైతులకు మంచి ఆదాయాలు కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న నమ్మకాలన్ని కల్పించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+