బాబు 7 మిషన్లు: ఇలా చేద్దాం,దృష్టి పెట్టండి(ఫోటోలు)
హైదరాబాద్: ఏపీలో డబ్బు సృష్టించడంతోపాటు ప్రజలకు సంతృప్తి కలిగేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచనలిచ్చారు. శనివారం సెక్రటేరియట్‌లో తన కార్యాలయంలో 7 మిషన్ల సమన్వయకర్తలు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల గురించి చర్చించారు. ఏపీ వృద్ధికి ప్రధానంగా దోహదం చేసే గ్రోత్ ఇంజిన్లపై శ్రద్ధచూపడంతోపాటు మిగిలిన శాఖల అభివృద్ధిపై దృష్టిసారించాలన్నారు. ఉద్యానవనరంగంలో సమర్థ విధానాలు అమలుచేస్తే 30శాతం దిగుబడులు పెరుగుతాయన్నారు.
దీనికోసమే రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల హెక్టార్లలో బిందుసేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. శ్రీసిటీ సెజ్‌లో త్వరలో పెప్సీకో ప్లాంటు ప్రారంభంకానున్నందున పండ్ల తోటల రైతులను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు.

బాబు 7 మిషన్లు... ఇలా చేద్దాం, దృష్టి పెట్టండి
టిష్యూకల్చర్ అరటి ద్వారా ఈ ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాని వాటా రూ.3,000 కోట్ల నుంచి రూ.6,700 కోట్లకు పెరిగిందని, దీనిని మరింతగా రెట్టింపు చేయాలన్నారు. వాల్‌మార్ట్, లులూ సంస్థలతోపాటు అమెరికాకు చెందిన ప్రముఖ రసాల కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి పెట్టాయన్నారు.

బాబు 7 మిషన్లు... ఇలా చేద్దాం, దృష్టి పెట్టండి
టమోటా సాగులో ఏడాదికి రెండు, మూడు పంటలు పండించగలిగితే, రైతులకు ఎకరానికి రూ. లక్ష దాకా రాబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక కొబ్బరిలో అంతర పంటలను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పామాయిల్ రైతులకు ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించాలని కోరారు. రాయలసీమను ఉద్వానవన కేంద్రంగా, ఏపీను ఆక్వాకల్చర్ హబ్‌గా చేయాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. పాలు, మాంసం, గుడ్లు, పండ్ల వినియోగం భారీగా పెరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మత్యృ, పాడి, కోళ్లు, ఉద్యానవన పంటల అభివృద్ధిపై మిషన్ శ్రధ్ధ పెట్టాలన్నారు.

బాబు 7 మిషన్లు... ఇలా చేద్దాం, దృష్టి పెట్టండి
భవన నిర్మాణాలకు అనుమతుల మంజూరులో ఎలాంటి వేధింపులకూ అవకాశం లేకుండా త్వరితగతిన పనులయ్యేలా చూడాలని కోరారు. మాతా, శిశు మరణాల విషయంలో ఐరాస నిర్ధేశించిన మిలినియన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా కృషి చేయాలి. దీనిపై మూడు నెలలకు ఒకసారి సర్వే చేయించాలన్నారు.

బాబు 7 మిషన్లు... ఇలా చేద్దాం, దృష్టి పెట్టండి
ఇక్కడ ఇంకా ఐటీ రంగం పుంజుకోవాల్సి ఉన్నందున, ఆలోపు నిర్మాణ, పర్యాటక, ఆతిధ్య రంగాలను మరింతగా బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, ఏడు మిషన్ల సమన్వయకర్తలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications