అమరావతి చుట్టు ఔటర్

విజయవాడ: సీఆర్‌డీఏ పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వారాంతపు సమీక్షా సమావేశం ప్రధానంగా ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లపై సాగింది. ఈ రహదారులకు సంబంధించి సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ 3 ఆప్షన్లను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నయ్-కలకత్తా జాతీయరహదారి, విజయవాడ-ముంబై జాతీయ రహదారి, విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారితో పాటు కొత్తగా నిర్మించబోయే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ రహదారికి అనుసంధానంగా ఉండేలా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+