నా వ్యాఖ్యల్లో తప్పులేదు, కావాలనే వక్రీకరించారు: చంద్రబాబు వివరణ
అమరావతి: దేవుళ్లు, ప్రజల విశ్వాసాలపై బుధవారం నాడు జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గురువారం వివరణ ఇచ్చుకున్నారు. దేవుళ్లు, నమ్మకాలపై తాను చేసిన వ్యాఖ్యలను ఓ వర్గానికి చెందిన మీడియా వక్రీకరించిందని ఆయన అన్నారు.

విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెండో రోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడు, దేవాలయాలపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, దేవుడు అంశాలపై తాను పాజిటివ్ గానే మాట్లాడనని ఆయన చెప్పుకొచ్చారు. అవినీతి రహిత పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కాగా కలెక్టర్ల సమావేశంలో తొలిరోజైన బుధవారం ఆయన మాట్లాడుతూ కష్టం వస్తే ప్రజలు దేవుడిని నమ్ముకుంటారని, అందుకే ఎక్కువ తప్పులు చేసి, ఎక్కువ డబ్బులు హుండీల్లో వేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతోనే ఆ శాఖ ఆదాయం పెరిగిందని అన్నారు. అంతేకాకుండా మద్యం తాగకుండా ఉండం కోసమే కొంతమంది దీక్షలు తీసుకుంటున్నారని అన్నారు.

దీక్షలు తీసుకున్న రోజుల్లో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయన్నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై పలు ప్రజా సంఘాలు మండిపడటంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. పాలనతో కొత్త పంథా అవసరమని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
We're introducing e-office in all districts. This will ensure transparency and accountability. #CollectorsConference pic.twitter.com/8BY7EsfHFU
— N Chandrababu Naidu (@ncbn) May 26, 2016
కలెక్టర్లకు విశేష అధికారులున్నాయని, ప్రజలకు వేధింపులు లేని, అవినీతి లేని పాలన అందించడంలో కలెక్టర్లదే బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి అధికార యంత్రాంగంలో పోటీతత్వం పెంచేలా కలెక్ట ర్లు చొరవ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మరోవైపు అన్ని జిల్లాల ఎస్పీలతో సాయంత్రం సీఎం సమావేశం కానున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications