వచ్చే ఏడాదికి 4 పోర్టులు, 4 హార్బర్లు సిద్ధం చేయాలి - ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శరవేగంగా ముందడుగు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే.. రాష్ట్ర ఆర్ధిక పునరుజ్జీవనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, రహదారుల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
లాజిస్టిక్స్ కార్పొరేషన్.. నాలుగు పోర్టులు, నాలుగు హార్బర్లు లక్ష్యం
ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర సంపదగా అభివృద్ధి చేయాలని అధికారులకు స్పష్టంగా సూచించారు. వచ్చే ఏడాది కోసం నాలుగు పోర్టులు, నాలుగు ఫిషింగ్ హార్బర్లు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టారు. వీటి నిర్వహణను సమర్థంగా నిర్వహించేందుకు త్వరలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఎయిర్‌పోర్టుల అభివృద్ధి & రహదారి విస్తరణ..
అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం ఎయిర్‌పోర్టుల నిర్మాణాన్ని తొలిదశలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పీపీపీ (PPP) విధానంలో రాష్ట్ర రహదారులను రద్దీకి అనుగుణంగా విస్తరించి, అన్ని ప్రధాన రహదారులను హైవేలతో అనుసంధానం చేయాలని చెప్పారు.
ఇక పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై వివరాలను అధికారులు.. సీఎంకు వివరించారు.
మచిలీపట్నం పోర్టు: 43.25% పూర్తయింది, 2025 నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం
రామాయపట్నం పోర్టు: 63.89% పూర్తయింది
మూలపేట పోర్టు: 46.59%
కాకినాడ గేట్‌వే పోర్టు: 29.92% పూర్తయినట్లు అధికారులు సీఎంకు నివేదించారు
ఫిషింగ్ హార్బర్ల పురోగతి..
జువ్వలదిన్నె హార్బర్: 97.72% పూర్తయింది
నిజాంపట్నం హార్బర్: 81.17%
మచిలీపట్నం హార్బర్: 69.20%
ఉప్పాడ హార్బర్: 78.94% పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు
ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ సంబంధిత అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ బీ సీ జనార్ధన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.#AndhraPradesh pic.twitter.com/utVonYNJ2b
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 3, 2025
యోగ దినోత్సవంపై సమీక్ష..
ఇందుకుతో పాటు, జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఎం ఆరా తీశారు. ఈ సమావేశానికి నారా లోకేష్, హోంమంత్రి అనిత, మంత్రి డోలా, మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం సన్నద్ధతపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. (1/2) pic.twitter.com/1EWjNlll3R
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 3, 2025












Click it and Unblock the Notifications