వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు సర్కారు రూ. 828 చెల్లించలేదు: ఎంఎస్ఎంఈలకు సీఎం జగన్ భారీ ప్యాకేజీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎస్ఎంఎంఈ)లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఎంఎంఈలు ప్రోత్సాహకాల విడుదల సందర్భంగా జిల్లా కలెక్టర్లు, పారిశ్రామికవేత్తలతో శుక్రవారం సీఎం జగన్ వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Recommended Video

AP CM YS Jagan Released MSMEs Financial Package
రూ. 450 కోట్ల విడుదల..

రూ. 450 కోట్ల విడుదల..

పరిశ్రమల రీస్టార్ట్ ప్యాకేజీని రెండు విడతల్లో రూ. 1110 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. మొదటి విడతగా రూ. 450 కోట్ల విడుదల చేసినట్లు జగన్ చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలను కూడా క్లియర్ చేస్తున్నామని తెలిపారు.ఎస్ఎంఎంఈలను కాపాడుకోకపోతే నిరుద్యోగం పెరుగుతుందని, వారి సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు.

10 లక్షల వరకు తక్కువ వడ్డీకే రుణాలు..

10 లక్షల వరకు తక్కువ వడ్డీకే రుణాలు..

ఎస్ఎంఎంఈల మనుగడ కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని తెలిపారు. ఈ రుణాలు రూ. 2లక్షల నుంచి 10 లక్షల వరకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో దాదాపు 97వేల ఎస్ఎంఎంఈలకు ఆర్థిక అండ లభిస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగంలో ఎక్కువ మంది ఉపాధిని ఇచ్చేవి ఎంఎస్ఎంసీలేనని తెలిపారు. ఎస్ఎంఎంఈలకు అవసరమైన పనులు చేసేందుకు ఒక జేసీని నియమించాలని సూచించారు. మానత్వంతో పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలన్నారు.

బాబు సర్కారు 828 కోట్ల పెండింగ్‌లో పెట్టింది..

బాబు సర్కారు 828 కోట్ల పెండింగ్‌లో పెట్టింది..

లాక్‌డౌన్ కారణంగా ఎస్ఎంఎంఈ రంగం కుదేలైందని.. కలెక్టర్లంతా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి చెల్లించలేదని.. మొత్తం రూ. 828 కోట్లు పెండింగ్‌లో పెట్టిందన్నారు. ప్రతి పరిశ్రమకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు తక్కువ వడ్డీకి ఇప్పించేలా రూ. 200 కోట్లతో కార్పస్ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.

మంచి యంగస్టర్ మంత్రి ఉన్నారంటూ గౌతమ్‌పై...

మంచి యంగస్టర్ మంత్రి ఉన్నారంటూ గౌతమ్‌పై...

సుబ్రమణ్యం, కరికాల వల్లభన్, సోలమన్ లాంటి మంచి అధికారులు, పరిశ్రమలు నిర్వహించడంలో అనుభవం ఉన్న మంచి యంగస్టర్ మంత్రి గౌతమ్ ఉన్నారని.. వీరి సహకారంతో ఎంఎస్ఎంఈలకు కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. ఎంఎస్ఎంఈలను అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు జగన్ ఈ సందర్భంగా తెలిపారు.

English summary
ap cm ys jagan announces big package to msmes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X