అమరావతి ఇళ్ల స్ధలాల పంపిణీపై జగన్ భావోద్వేగం-రుణపడి ఉంటానని ట్వీట్..

ఏపీ ప్రభుత్వం ఇవాళ అమరావతిలో విజయవంతంగా పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ పూర్తి చేసింది. సీఎం జగన్ స్వయంగా వెళ్లి దాదాపు 50వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తవుతుందని హామీ ఇచ్చారు. అమరావతిలో రాజకీయ లెక్కల్ని మారుస్తుందని భావిస్తుందని భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.

అమరావతిలో ఇళ్ల స్ధలాల పంపిణీ ప్రక్రియ అంత సాఫీగా జరగలేదు. ఇవాళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముందు విపక్షాలు కోర్టులకు వెళ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. స్ధానిక రైతులతో పిటిషన్లు వేయించాయి. ఓవైపు రాజధాని అంటూనే మరోవైపు ఓ వర్గం మాత్రమే ఉండాలని కోరుకున్నారు. దీంతో న్యాయపరమైన అడ్డంకుల్ని అధిగమించడమే కాకుండా అతి తక్కువ సమయంలో ప్రభుత్వం ప్లాట్లను పంపిణీ చేసింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ వైఎస్ జగన్ ఇవాళ ట్వీట్ చేశారు.

 jagan

"అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్ళ స్థ‌లాలు ఇచ్చేందుకు మ‌న ప్ర‌భుత్వం సుప్రీంకోర్ట్ వ‌ర‌కూ వెళ్ళి పోరాడింది. నేడు అదే అమ‌రావ‌తిలో రూ.7 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌లు విలువ చేసే ఇళ్ళ స్థ‌లాల‌కు 50,793 మంది అక్క‌చెల్లెమ్మ‌ల‌ను య‌జ‌మానుల‌ను చేసింది మ‌న ప్ర‌భుత్వం. ఇంత మంచి కార్య‌క్ర‌మం నిర్వ‌హించే అవ‌కాశాన్ని నాకు క‌ల్పించిన దేవుడికి, మీకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను." అంటూ వైఎస్ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

అమరావతిలో పేదల ఇళ్ల స్ధలాల్ని ఇవాళ పంపిణీ చేసిన ప్రభుత్వం.. వారంలోనే వీటిలో ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టబోతోంది. ఇది కూడా పూర్తయితే వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగు ఉండబోదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు ఈ కార్యక్రామాన్ని తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+