వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచివాలయాల ఉద్యోగులపై జగన్ ప్రశంసలు-80 శాతం సంతృప్తికరం-తనిఖీల్లో వెల్లడి

|
Google Oneindia TeluguNews

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు బాగా మెరుగుపడినట్లు సీఎం జగన్ ఇవాళ వెల్లడించారు తనిఖీలకు వెళ్లినప్పుడు అధికారులు రిజిస్టర్లను పరిశీలించడం తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు.

సచివాలయాలకు అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు గతంలో వ్యక్తంచేసిన సమస్యలను పరిష్కరించామా? వాటిని సరిచేశామా? లేదా?చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. రిజిస్టర్‌లోపేర్కొన్న అంశాలను సచివాలయాల విభాగాధిపతికి పంపించాలన్నారు. అలాగే ఏదైనా పరిష్కరించాల్సిన కొత్త అంశాన్ని గుర్తిస్తే.. వాటిని కూడా రిజస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.

గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీచేసినప్పుడు గుర్తించిన అంశాలు, సమస్యలను పరిష్కరిస్తున్నారా? లేదా?వాటిపై దృష్టిపెడుతున్నారా? లేదా? అన్నదానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.దీనికి సంబంధించిన ప్రోటోకాల్‌ను తయారుచేయాలన్నారు. ఆ ప్రోటోకాల్‌ను పాటిస్తున్నారా? లేదా?కచ్చితంగా చూడాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.

ap cm ys jagan express 80 percent satisfaction over working of village secretariats staff

రాష్ట్రంలో దాదాపు 80శాతం సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనపరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందని సీఎం జగన్ తెలిపారు. మిగిలిన 20 శాతం మంది సచివాలయాల సిబ్బందికి కూడా వారు పనితీరును మెరుగుపరిచేలా మనం వారికి తోడ్పాటును అందించాలని అధికారుల్ని సీఎం కోరారు. నూటికి నూరు శాతం గ్రామ, వార్డు సచివాలయాలు పనితీరును చూపించేలా సిబ్బందికి తగిన చేయూతను, తోడ్పాటును అందించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు..

వాలంటీర్ల సేవలపైనా కూడా దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్లకు సీఎం సూచించారు. వారు మెరుగైన సేవలు అందించేలా వారికి కౌన్సెలింగ్‌ చేయాలన్నారు.వారు అప్‌గ్రేడ్‌ అయ్యేలా చూడాలని కోరారు. అందుకు వారికి చేయూతనిచ్చి.. తీర్చిదిద్దాలన్నారు.అప్పటికీ కూడా సేవలను అందించడంలో వారు ప్రమాణాలను అందుకునే రీతిలో లేకపోతే వారిని తొలగించి కొత్తవారిని పెట్టాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంోల ఖాళీగా ఉన్న వాలంటీర్‌ పోస్టులను భర్తీచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే సచివాలయాలకు అందుతున్న విజ్ఞాపనలు, వినతుల పరిష్కారంపై కూడా దృష్టిపెట్టాలన్నారు. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలని జగన్ సూచించారు. సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం అక్టోబరు 29, 30 తేదీల్లో చేపట్టేలా జగన్ ఆదేశాలు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. బృందాలుగా ఏర్పడి వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలని జగన్ తెలిపారు. గతలో జరిగిన అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో కొన్నిచోట్ల కేవలం వాలంటీర్లు మాత్రమే కలిసినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. కచ్చితంగా సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల బృందాలుగా ఏర్పడి... కుటుంబాలను కచ్చితంగా కలవాలని జగన్ సూచించారు.

నెలలో ప్రతి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలని జగన్ మరో ఆదేశం ఇచ్చారు. సిబ్బంది, వాలంటీర్లు ఈ సమావేశాల్లో పాల్గొనాలన్నారు. సచివాలయాల్లోని మౌలిక సదుపాయాలు, పరికరాలు కచ్చితంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలన్నారు. మొబైల్స్, గౌరవవేతనం, సీఎఫ్‌ఎంస్‌ ఐడీలు, సిమ్‌కార్డులు, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలన్నారు. నెలలో రెండో బుధవారం మండలం లేదా యూఎల్‌బీ స్థాయిలో సమావేశం జరగాలని జగన్ ఆదేశించారు. నెలలో మూడో బుధవారం జిల్లా స్థాయిలోసమావేశం కావాలన్నారు. నాలుగో బుధవారం రాష్ట్ర స్థాయిలో సచివాలయాల విభాగానికి చెందిన కార్యదర్శి సమావేశం కావాలన్నారు. ప్రతి ఏటా రెండు సార్లు జూన్, డిసెంబరుల్లో పెన్షన్లు, రేషన్‌కార్డులు, పట్టాలు తదితర పథకాలకు సంబంధించి మంజూరు ఉంటుందని జగన్ తెలిపారు. దీన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు.

ap cm ys jagan express 80 percent satisfaction over working of village secretariats staff

అలాగే ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ కలెక్టర్లు, అధికారులకు సూచించారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంజిల్లాల్లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ వినియోగంపై తగిన దృష్టిపెట్టాలన్నారు. కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనకబడి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే సచివాలయాల భవనాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. అలాగే రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తిచేయాలని. కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌పైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో డిజిటిల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అవాతంరాలు లేకుండా ఇంటర్నెట్‌ను సరఫరాచేస్తామన్నారు. దీనివల్ల వర్క్‌హోం కాన్సెప్ట్‌ సాకారం అవుతుందన్నారు. డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులకు జగన్ సూచించారు. తొలివిడతలో భౠగంగా 4314 లైబ్రరీలను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ లైబ్రరీల నిర్మాణానికి సంబంధించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

పంట కొనుగోలు జరగాలంటే ఇ- క్రాపింగ్‌చేయాలని, ఇ- క్రాపింగ్‌ చేయించడమన్నది రైతు భరోసా కేంద్రాల ప్రాథమిక విధి అని సీఎం జగన్ అన్నారు. ఇ- క్రాపింగ్‌పైన కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. సీఎం-యాప్‌ పైనకూడా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడ రైతులకు ధరల విషయంలో నిరాశజనక పరిస్థితులు ఉన్నా.. సీఎం యాప్‌ద్వారా... పర్యవేక్షణ చేసి వెంటనే రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలన్నారు. ఇ- క్రాపింగ్‌చేసిన తర్వాత డిజిటల్‌ రశీదుతోపాటు, భౌతికంగా కూడా రశీదు ఇస్తున్నారా? లేదా?చూడాలని అధికారుల్ని ఆదేశించారు గ్రామంలోని ప్రతి ఎకరా కూడా ఇ-క్రాపింగ్‌జరగాల్సిందేనన్నారు.

English summary
ap cm ys jagan on today express satisfaction over work of village and ward secretariats in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X