Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇకపై ఏపీ మారుమూల గ్రామాలలోనూ టెక్నాలజీ పరుగులు; కుగ్రామాలకు 4జి సేవలు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామాలలో ఇకపై టెక్నాలజీ పరుగులు పెట్టనుంది. ఏపీలోని మారుమూల గ్రామాలకు 4జి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో ఒకేసారి 100 జియో టవర్ లు అందుబాటులోకి రావడంతో, ఏపీలోని మారుమూల గ్రామాల్లోనూ ఇకపై మొబైల్ సర్వీసులు, ఇంటర్నెట్ పరుగులు పెట్టనుంది.

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు క్యాంపు కార్యాలయం నుంచి ఒకేసారి 100 జియో టవర్లను వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో 209 మారుమూల ప్రాంతాల గ్రామాలకు 4జి సేవలు అందనున్నాయి. రిలయన్స్ సంస్థ ఏర్పాటుచేసిన ఈ టవర్లను ప్రారంభించడం వల్ల ఆయా గ్రామాలలో టెక్నాలజీ పరుగులు పెట్టనుంది.

 jaganlanching4gservices

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైఎస్ఆర్ జిల్లాలో రెండు టవర్లను ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి 4జి సేవలు అందుబాటులోకి రావడం ద్వారా గ్రామాలలో ప్రగతి మరింత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో సెల్ సర్వీసులు, ఆవాసాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ తో పాటు పెద్దఎత్తున మార్పులు రానున్నాయని ఆయన అన్నారు.

టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాలలోని అన్ని సచివాలయాలు, ఆర్ బి కే లు, స్కూళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుందని, రేషన్ పంపిణీ, ఈ క్రాప్ బుకింగ్ కూడా సులభతరం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను మరింత పారదర్శకంగా అందించడానికి ఇది దోహదం చేస్తుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంకా ప్రజలకు మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నాం అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టవర్లను ఏర్పాటు చేసిన రిలయన్స్ జియో సంస్థ భవిష్యత్తులో 5 జి సేవలను కూడా అప్ గ్రేడ్ చేయనుంది. కొత్తగా ప్రారంభించిన సెల్ టవర్ల వల్ల మారుమూల ప్రాంతాల నుంచి ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా ఈ 2704 ప్రాంతాలలో టవర్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం స్థలాలను కూడా ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+