సైబరీ స్టన్నింగ్ ఫినిష్: బ్రెజిల్ కు చెక్

ఫిఫా ప్రపంచకప్ లో బ్రెజిల్ కు ఆదిలోనే చెక్ పడింది. తన మొదటి మ్యాచ్ లో మొరాకోను ఢీ కొన్న ఈ టైటిల్ హాట్ ఫేవరెట్ విజయాన్ని అందుకోలేకపోయింది. డ్రాతో సరిపెట్టుకుంది. టీమ్ హెడ్ కోచ్ గా కార్లో అన్సెలోట్టికి ఫీఫా వరల్డ్ కప్ అరంగేట్ర మ్యాచ్ కూడా ఇదే. మొరాకో డిఫెండర్లు, ఫార్వర్డర్ల ధాటికి తనదైన శైలిలో ఆడలేకపోయింది బ్రెజిల్. ఒకదశలో పూర్తిగా డిఫెన్స్ ఆడాల్సొచ్చిందంటే మొరాకో ఎంతగా ఆధిపత్యం చలాయించిందో అర్థం చేసుకోవచ్చు.

న్యూజెర్సీలో గ్రూప్ సీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ 1-1తో డ్రా అయింది. అయిదు సార్లు ప్రపంచకప్ గెలిచిన బ్రెజిల్‌ను మొరాకో నిలువరించడం హైలైట్. మొరాకో తరఫున ఇస్మాయిల్ సైబారీ మెరుపు గోల్ ఆ జట్టు విజయానికి బ్రెజిల్ విజయానికి బ్రేకులు వేసింది. ఫుట్ బాల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా పేరున్న బ్రెజిల్ తరఫున ఒకే ఒక్క గోల్ నమోదైంది. వినిసియస్ జూనియర్ దాన్ని సాధించాడు. అదీ లేకపోయివుంటే జట్టు పరాజయం పాలయ్యేది.

FIFA Highlights Brazil vs Morocco Saibari s Stunning Finish Stuns Brazil Vin cius Answers ends Draw

ఈ మ్యాచ్‌లో మొరాకో ఆటగాళ్లు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఖతార్ ప్రపంచకప్‌లో లభించిన విజయాల స్ఫూర్తితో మైదానంలో మెరుపు వేగంతో కదిలారు. బ్రెజిల్ డిఫెన్స్ పై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో బ్రెజిల్ తన సహజసిద్ధమైన దూకుడును ప్రదర్శించడంలో ఇబ్బంది పడాల్సి వచ్చింది. అన్సెలోట్టి బ్రెజిల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మ్యాచ్ కావడంతో అందరి దృష్టి ఆయన వ్యూహాలపైనే నిలిచింది గానీ.. తుదిఫలితం నిరాశపరిచింది.

మ్యాచ్ ప్రారంభమైన 21వ నిమిషంలోనే బ్రాహిమ్ డియాజ్ అందించిన పాస్‌తో మొరాకో ఆటగాడు ఇస్మాయిల్ సైబారీ అద్భుతమైన గోల్ సాధించాడు. బ్రెజిల్ గోల్‌కీపర్ అలిసన్ బెకర్‌ను బురిడీ కొట్టిస్తూ సైబారీ కొట్టిన షాట్‌తో మొరాకో శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. బ్రెజిల్ జట్టులో వినిసియస్ జూనియర్, రఫిన్హా, బ్రూనో గుమారెస్, కాసెమిరో వంటి ప్రపంచ స్థాయి స్టార్లు ఉన్నప్పటికీ వారి ఆటతీరు అంచనాలకు భిన్నంగా సాగింది.

ప్లేయర్ల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. బంతిని ఖచ్చితత్వంతో పాస్‌ చేయలేకపోయారు. ఈజీగా బంతిని ప్రత్యర్థికి సమర్పించడం వంటి పొరపాట్లు అనేకం. పరిస్థితి తీవ్రతను గమనించిన రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ వినిసియస్ జూనియర్ మ్యాచ్ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. మెరుపువేగంతో ప్రత్యర్థి బాక్స్ వైపు దూసుకెళ్లిన వినిసియస్.. ఓ సూపర్ కిక్‌తో బంతిని నెట్ లోనికి పంపి మ్యాచ్‌ను సమం చేశాడు.

ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ గోల్స్‌లో ఒకటిగా నిలిచిందీ షాట్. ద్వితీయార్థంలో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. బ్రెజిల్ ను బ్రెంట్‌ఫోర్డ్ లీడ్ చేశాడు. అయినప్పటికీ.. మొరాకో డిఫెన్స్ ను దాటుకుని మరో గోల్ సాధించడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత మాథ్యూస్ కున్హా సబ్‌స్టిట్యూట్‌గా వచ్చినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. సూపర్ స్టార్ నెయ్ మార్ లేని లోటు బ్రెజిల్ జట్టులో ప్రస్ఫుటంగా కనిపించింది. గాయం కారణంగా అతడు అందుబాటులో లేడు.

ఫలితంగా.. బంతిని తమ నియంత్రణలో ఉంచుకుని అటాకింగ్ వేగాన్ని నియంత్రించే సరైన ఆటగాడు కరవయ్యాడు. ఈ డ్రా ఫలితంతో మొరాకో గ్రూప్-సీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బ్రెజిల్ ఒక పాయింట్ సాధించినప్పటికీ, టోర్నమెంట్‌లో నిలదొక్కుకోవాలంటే ఆట తీరును పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రాన్స్, పోర్చుగల్, అర్జెంటీనా వంటి అగ్రశ్రేణి జట్లను ఎదుర్కోవాల్సి ఉన్నందున లోపాలను సరిదిద్దుకోక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+