Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌కు వైఎస్ జగన్ ఫోన్ కాల్

అమరావతి: కరోనా వైరస్ బారిన పడిన ఏపీ గర్నవర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం అనారోగ్యానికి గురైన ఆయనను అధికారులు హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రత్యక ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

అనంతరం ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బిశ్వభూషణ్ హరిచందన్ ఇదివరకే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. అయినప్పటికీ- ఆయనలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆయన జ్వరం, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఆక్సిజన్ లెవెల్స్ సాధారణంగా స్థితిలోనే ఉన్నాయని, ఆరోగ్యం పట్ల ఆందోళన పడొద్దంటూ ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు.

AP CM YS Jagan phone call to Governor Biswabhusan Harichandan and inquire his health

అనారోగ్యానికి గురైన గవర్నర్‌ను వైఎస్ జగన్ పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో ఆయన గవర్నర్‌కు ఫోన్ చేశారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తాను ఇదివరకే డాక్టర్లతో మాట్లాడానని చెప్పారు. సరైన సమయంలో గవర్నర్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు డాక్టర్లు పేర్కొన్నారని అన్నారు. బిశ్వభూషణ్ త్వరగా కోలుకోవాలని అకాంక్షిస్తున్నట్లు వైఎస్ జగన్ చెప్పారు. త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని అన్నారు.

గవర్నర్‌లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆయనను ప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డులో ఉంచి, డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. నాణ్యమైన ట్రీట్‌మెంట్‌ను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వృత్తిరీత్యా హరిచందన్ న్యాయవాది. జనతాదళ్‌లో చేరడంతో ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. 1996లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అయిదు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీ-బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. కీలకమైన రెవెన్యూ, న్యాయ, మత్స్యాభివృద్ధి శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+