చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ సీఎం కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ: వెంటనే కారు ఆపిన జగన్ ఏం చేశారంటే?

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి వెళ్లే క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌ను ఓ మహిళ వెంబడించారు. ఈ క్రమంలో సీఎం జగన్ స్పందించిన తీరు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోది. దటీజ్ జగన్ అని అభిమానులు, నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే.. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి తిరుపతిలోని తాజ్ హోటల్‌కు వెళుతుండగా.. ఓ మహిళ చేతిలో పత్రాలు పట్టుకుని సీఎం కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. ఈ విషయాన్ని సీఎం జగన్ గమనించారు. వెంటనే ఆయన కాన్వాయ్ ఆపించి ఆ మహిళ సమస్య ఏంటో తెలుసుకోవాలని తన ఓఎస్డీ ధనుంజయరెడ్డిని పంపించారు.

 AP cm YS Jagan stops his convoy after watching a woman running towards him.

సీఎం జగన్ ఆదేశాలతో ఓఎస్‌డీ ధనుంజయరెడ్డి వెళ్లి బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. కాన్వాయ్ వెంటపడిన ఆ మహిళ.. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విజయకుమారి. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, కుటుంబ పోషణ కోసం ఏదైనా ఉపాధి చూపించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఆమె నుంచి వివరాలు తీసుకున్న అనంతరం సీఎం జగన్ కాన్వాయ్ ముందుకు కదిలింది.

ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న వారు ఇబ్బంది పెడుతున్నారని, ఎమ్మెల్యే చెప్పినా తన పని జరగకపోవడంతో.. నేరుగా ముఖ్యమంత్రికి మొర పెట్టుకునేందుకే ఆమె ఇలా చేసినట్లు తెలిసింది. తన సమస్యను పరిష్కరించాలని ఆ మహిళ ఓఎస్‌డీని వేడుకుంది.

Recommended Video

AP MLC Elections : అభ్యర్ధుల ఎంపిక పూర్తి .. కొత్తగా 14 మంది ఖరారు..! || Oneindia Telugu

ప్లీజ్ హెల్ప్ సీఎం అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో.. అది గమనించిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని ఆపి తన ఓఎస్‌డీని బాధితురాలి దగ్గరకు పంపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దటీజ్ సీఎం జగన్, ప్రజల ముఖ్యమంత్రి అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సీఎం ఓఎస్డీ వచ్చి తన సమస్యను తెలుసుకోవడంతో ఆ మహిళ ఆనందం వ్యక్తం చేసింది. సీఎం జగన్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని తెలిపింది.

English summary
AP cm YS Jagan stops his convoy after watching a woman running towards him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X