వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీజీ.. థాంక్యూ, సందిగ్ధత తొలగింది -కొవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని ప్రకటనకు ఏపీ సీఎం రియాక్షన్

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి కొనసాగుతుండటం, అందరికీ వ్యాక్సిన్లు అందని పక్షంలో మూడో దశ విలయం ఇంకా భయంకరంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరతపై నెలకొన్న సందేహాలను, రాష్ట్రాల వినతులను నివృత్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కీలక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతించారు.

Recommended Video

PM Modi: Free Vaccination To All From June 21 | COVID 19 | 3rd Wave | Oneindia Telugu

దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని, రాష్ట్రాలపై పైసా కూడా భారం పడబోదంటూ ప్రకటన చేసినందుకుగానూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. జాతినుద్దేశించి ప్రధాని మోదీ సోమవారం ఇచ్చిన సందేశంలో.. 75శాతం టీకాలు కేంద్రమే సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని, ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

జగన్‌కు ఎన్డీఏ షాక్?: రఘురామకు బిహార్ సీఎం మద్దతు! -ఫోన్ బెదిరింపులపై ఏపీ సీఐడీ కీలక వివరణజగన్‌కు ఎన్డీఏ షాక్?: రఘురామకు బిహార్ సీఎం మద్దతు! -ఫోన్ బెదిరింపులపై ఏపీ సీఐడీ కీలక వివరణ

ap-cm-ys-jagan-thanks-pm-modi-for-making-covid-vaccination-national-agenda-of-utmost-priority

టీకాలపై కేంద్రం యూటర్న్ తీసుకోవడానికి జగన్ రాసిన లేఖే కారణమని వైసీపీ శ్రేణులు సందేశాలను షేర్ చేసుకుంటుండగా, జాతీయ మీడియా మాత్రం సుప్రీంకోర్టు మొట్టికాయల వల్లే మోదీ దిగొచ్చాడని వ్యాఖ్యానించింది. ఏదిఏమైనా ప్రధాని ప్రకటనతో వ్యాక్సిన్లపై నెలకొన్న సందిగ్ధం తొలగిపోయిందని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అన్నారు.

''కోవిడ్‌పై పోరాటంలో మనకున్న వజ్రాయుధం వ్యాక్సిన్లు మాత్రమే. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లపై నెలకొన్న సందిగ్ధతను తొలగించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. వ్యాక్సినేషన్ ప్రక్రియను జాతీయ అజెండాగా భావించి అధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు'' అని ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

వ్యాక్సిన్లపై మోదీ యూటర్న్: ఘనత మాదేనన్న విపక్ష సీఎంలు -కరోనా థార్డ్ వేవ్‌ ఆగుతుందన్న బీజేపీ సీఎంలువ్యాక్సిన్లపై మోదీ యూటర్న్: ఘనత మాదేనన్న విపక్ష సీఎంలు -కరోనా థార్డ్ వేవ్‌ ఆగుతుందన్న బీజేపీ సీఎంలు

అందరికీ టీకాల బాధ్యత కేంద్రానిదే అని ప్రధాని మోదీ ప్రకటన చేయడానికి కొద్ది రోజుల ముందు.. అన్ని రాష్ట్రాల సీఎంలకు సీఎం జగన్‌ లేఖ రాయడం తెలిసిందే. ఏపీ సహా 9 రాష్ట్రాలు వ్యాక్సిన్‌ కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచినా.. ఒక్క బిడ్‌ కూడా రాలేదని, గ్లోబల్ టెండర్లు ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని, వ్యాక్సిన్ లభ్యత విషయంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్నట్లుగా పరిస్థితి మారుతోందని, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలని, కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వాలని జగన్ కోరారు. వ్యాక్సిన్ల విషయంలో ఏపీ సీఎం సోమవారం నాడు ఢిల్లీకి వెళ్ళి కేంద్రం పెద్దలను కలవాలని భావించినా, ప్రధాని ప్రకటన నేపథ్యంలో కేంద్ర మంత్రులు బిజీగా ఉండటంతో ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు వ్యాక్సిన్ల సరఫరాకు ప్రధాని హామీ ఇవ్వడంతో జగన్ ఢిల్లీ టూర్ ఉంటుందా, రద్దవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

English summary
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy on Monday thanked Prime Minister Narendra Modi for the Centre's decision to provide free COVID vaccines to all citizens above 18 years of age and said making vaccination a national agenda of utmost priority. In a tweet, Andhra Pradesh Chief Minister said, "Vaccination is the only weapon in this battle against COVID-19. Sincere thanks to Prime Minister Narendra Modi ji for clearing this uncertainty and making vaccination a national agenda of utmost priority. #FreeVaccineForAll."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X