చెయ్యలేకపొతే ఓపెన్‌గా చెప్పండి- కుండబద్దలు కొట్టనున్న వైఎస్ జగన్..!!
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీపరంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీపడట్లేదు. ఇందులో భాగంగా తరచూ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోన్నారు.

ప్రజల నుంచి నేరుగా..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్‌బ్యాక్‌ను వైఎస్ జగన్ దీనికి ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకూ మన ప్రభుత్వం ఉపయోగపడుతోంది. భవిష్యత్‌లో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించే అవకాశాలు లేకపోలేదు.

రేపే మరో విడత..
శుక్రవారం వైఎస్ జగన్ మరోసారి వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు.. ఇందులో పాల్గొననున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏ మేరకు అందుబాటులో ఉంటోన్నారు?, సమస్యల పరిష్కారం చూపుతున్న చొరవ, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై మెజారిటీ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలపై ఇప్పటికే ఆయన ఓ నివేదికను తెప్పించుకున్నారు.

వై నాట్ 175..
ఈ పరిణామాలన్నీ- గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవట్లేదంటూ ఫిర్యాదులను అందుకున్న అధికార పార్టీ సిట్టింగ్ శాసన సభ్యుల్లో ఆందోళనకు కారణమౌతోంది. 175 నియోజకవర్గాలన్నింట్లోనూ గెలిచి తీరాలంటే.. కొన్ని కఠిన నిర్ణయాలను వైఎస్ జగన్ తీసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తర-తమ తేడా చూడట్లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. ఏ ఎమ్మెల్యే అయినా ఈ లక్ష్యాన్ని సాధించేలా పనులను చెయ్యకపోతే ఇప్పుడే చెప్పాలని, వారి సేవలను తాను మరో రూపంలో వినియోగించుకుంటాననే సంకేతాన్ని వైఎస్ జగన్ ఇవ్వబోతోన్నారని చెప్పారు.

16 నెలల్లో ఎన్నికలు..
మైలవరం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కూడా వైఎస్ జగన్ ఇవే వ్యాఖ్యలు చేశారు. మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయని స్పష్టం చేశారు. మైలవరం నియోజకవర్గంలో సుమారు 89 శాతం ఇళ్లకు మేలు జరిగిందని పేర్కొన్నారు. 900 కోట్ల రూపాయల నగదును నియోజకవర్గ ప్రజలకు అందజేసినట్లు చెప్పారు. ప్రతి కుటుంబం కూడా ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిందని అన్నారు.

అదేం అంత కష్టం కాదు..
తమ టార్గెట్ 175కు 175 గెలవడమేనని, అదే తమ లక్ష్యమని వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. అది కష్టం కూడా కాదని తేల్చి చెప్పారు. కుప్పంలో గతంలో వేరే పార్టీ గెలవలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తాము జయకేతనాన్ని ఎగురవేశామని గుర్తు చేశారు. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, 89 శాతం ఇళ్లకు పూర్తి పారదర్శకంగా ప్రతి ఒక్కటి అందుతోందని వివరించారు. ఎక్కడా అవినీతికి తావు లేదని, అలాంటప్పుడు 175కు 175కు ఎందుకు సాధ్యం కాదని అన్నారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications