YS Jagan Resignation: కాసేపట్లో వైఎస్ జగన్ రాజీనామా-గవర్నర్ అపాయింట్ మెంట్..!
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా సమర్పించేందుకు వైఎస్ జగన్ సిద్దమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్ మెంట్ కూడా కోరారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు రావాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మధ్యాహ్నం రాజ్ భవన్ కు వెళ్లి జగన్ సీఎం పదవికి రాజీనామా సమర్పించబోతున్నారు. అనంతరం ఫలితాలపై జగన్ స్పందించే అవకాశం ఉంది.

గత ఎన్నికల్లో 175 సీట్లకు 151 సీట్లు సాధించి భారీ విజయం సొంతం చేసుకున్న వైసీపీకి ఈసారి మాత్రం కేవలం 15 సీట్లు దక్కాయి. కూటమి భారీ విజయం నేపథ్యంలో వైఎస్ జగన్ కేబినెట్లో దాదాపు మంత్రులంతా ఓటమిపాలయ్యారు. సీనియర్ నేతలు, పలుమార్లు వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ఓడిపోయారు. ముఖ్యంగా వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయలసీమ ప్రాంతంలో సైతం కూటమి అత్యధిక సీట్లు గెల్చుకుంది. దీంతో వైసీపీ పరాజయం పరిపూర్ణమైంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైఎస్ జగన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో సీఎం జగన్ రాజిీనామా చేసేందుకు గవర్నర్ అపాయింట్ మెంట్ అడిగారు. ఇప్పటివరకూ ఫలితాలపై స్పందించని జగన్.. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన తర్వాత మాట్లాడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications