వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో నేటితో ఫీవర్‌ సర్వే పూర్తి- 39 వేల మంది గుర్తింపు- బ్లాక్‌ ఫంగస్‌తో కొత్త కలకలం

|
Google Oneindia TeluguNews

ఏపీలో జ్వర పీడితుల్నిగుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ఫీవర్‌ సర్వే చురుగ్గాసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి ఈ సర్వే పూర్తి కానుంది. ఇప్పటివరకూ ఈ సర్వేలో 39 వేల మందికి పైగా బాధితుల్ని ప్రభుత్వం గుర్తించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేలో పలు కీలక విషయాలు బయటపడుతుండటంతో దీని ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్ర వ్యాప్తంగా జ్వర పీడితుల గుర్తింపు కార్యక్రమం చురుగ్గా, పకడ్బందీగా సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆశా కార్యకర్తలు...ఇంటింటికీ జ్వరపీడితులను గుర్తిస్తున్నారన్నారు. గుర్తించిన జ్వరపీడితులకు ఎఎన్ఎంలు.. మందులు, ఐసోలేషన్ కిట్లు అందజేస్తారన్నారు. ఇవాళ సాయంత్రానికి సర్వే పూర్తయ్యే అవకాశముందన్నారు. ఇప్పటికే వరకూ 39 వేల మంది జ్వరపీడితులను గుర్తించారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైద్యాధికారుల సమావేశం ఉందని, ఇంటింటి సర్వేపై పూర్తి వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. జర్వపీడితులకు సరైన సమయంలో వైద్య సేవలు అందిస్తే, కరోనా కేసులు, ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుముఖం పడతాయన్నారు.

ap covid 19 fever survey found 39k affected, new fears with black fungus

బ్లాక్ ఫంగస్ కేసుల నమోదుపై ఆరా...
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా..? అని అధికారులు ఆరా తీస్తున్నారన్నారని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అదే సమయంలో బ్లాక్ ఫంగస్ నివారణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఏపీకి 1600 వాయల్స్ వాటాగా కేటాయించగా, వాటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఇప్పటికే నిడదవోలులో ఓ క్యాబ్‌ డ్రైవర్‌కు బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు గుర్తించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల నుంచి శాంపిల్స్సేకరిస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్ విషయంలో భయపడాల్సిందేమీ లేదని సింఘాల్‌ వెల్లడించారు.

English summary
fever survey for finding covid 19 cases in andhra pradesh to be completed today. and recently found black fungus cases in nidadavole also create fears among public and govt also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X