గవర్నర్‌కు లేఖ: తెలంగాణ ప్రభుత్వాన్ని ఉతికేసిన ఎపి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య తాజాగా మరో వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అధికార బలంతో రాజ్యాంగాన్ని, చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని, ఇది తమ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆరోపించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్‌ కృష్ణారావు రాష్ట్ర గవర్నర్‌కు సుదీర్ఘ లేఖ రాశారు.

కార్పొరేషన్లను, అకాడమీలను విభజించడానికి నిర్దిష్టమైన పద్ధతులను పాటించకుండా కేవలం పేరు మార్చేసి, ‘ఈ సంస్థ మాది' అంటూ తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు గవర్నర్‌కు రాసిన లేఖలో ఆరోపించారు.

AP CS complains against Telangana government

ఇది ఉభయ రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తోందని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం విషయంలో కూడా ఇదే జరుగుతోందని, దీనివల్ల ఆయా సంస్థల్లో పరిపాలన స్తంభించటంతోపాటు, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఆయన అంటూ ఈ విషయంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కోరారు.

వాటి విషయంలోనే కాకుండా ఏ షెడ్యూల్‌లోనూ చేర్చని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లాంటి పలు సంస్థల విషయంలో ఏదో ఒకటి తేల్చాలని కోరారు. ఆయా విభాగాలకు సంబంధించిన ఉభయ రాష్ట్రాల అధికారులకు తిన ఆదేశాలు జారీ చేయాలని కృష్ణారావు గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది. విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి యాజమాన్య పద్ధతులను పాటించేలా తగు ఆదేశాలు జారీ చేయాలని ఆయన గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+