అవును.. గజదొంగను వదిలేశారు: ఏపీ డిప్యూటీ సీఎం
హైదరాబాద్: పోలీసులు గజదొంగను వదిలేశారని, అది నిజమేనని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప శుక్రవారం అన్నారు. దొంగను పట్టుకొని తీసుకు రావాలని ఆదేశించినట్లు చెప్పారు. విచారణ అనంతరం సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా పెదపూడి పోలీసు స్టేషన్‌లో గజదొంగ నుండి రూ.లక్ష తీసుకొని పోలీసులే అతడిని బయటకు తప్పించినట్లుగా వార్తలు వచ్చాయి. దీని పైన ఏపీ హోం మంత్రి స్పందించారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న గజదొంగ పారిపోయాడని... కాదు కాదు పోలీసులే లంచం తీసుకుని వదిలేశారని మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన చినరాజప్ప... పై విధంగా స్పందించారు.

దొంగనోట్ల ముఠా అరెస్టు
కృష్ణా జిల్లా కలిదిండిలో దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముఠా నాయకుడు వెంకన్న సహా నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.5 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఈ ముఠా దొంగనోట్లను తెచ్చి ఇక్కడ చెలామణి చేస్తోంది. ఈ ముఠా గత ఎన్నికల్లోనూ దొంగనోట్లను సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో కేసును పోలీసులు సీఐడీకి అప్పగించారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications