వాలంటీర్లు అందుకే దూరం! నిధుల్లేక జీతం తీసుకోవట్లేదు.! పవన్ కామెంట్స్..!
ఏపీలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా పంపిణీ చేయవచ్చో నిరూపిస్తూ సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Say less, do more, inspire many
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) July 1, 2024
A True Stalwart @PawanKalyan
pic.twitter.com/h3djUZ08SU
ఎన్నికల ఫలితాల తర్వాత తొలి బహిరంగ సభను గొల్లప్రోలులోనే ఏర్పాటు చేసిన పవన్.. స్థానికులతో మనసు విప్పి మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఊరేగింపులు చేయాలనుకోలేదని, ఇప్పుడు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు పవన్ తెలిపారు. ప్రస్తుతం తాను పాలనా విధానాన్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేయదల్చుకోలేదన్నారు.
కూటమి వస్తే పెన్షన్లు రద్దు చేస్తారని చాలా మంది చెప్పారని, కానీ తాము వచ్చాక పెన్షన్లు పెంచి ఇస్తున్నట్లు పవన్ గుర్తుచేశారు. అలాగే వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇవ్వలేరని ప్రచారం చేశారని, దాన్ని తప్పని నిరూపించడానికే సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పిస్తున్నట్లు పవన్ తెలిపారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టారని, కానీ ఎక్కడ ఆగాయని పవన్ ప్రశ్నించారు. ఇవాళ ఇంటికి పెన్షన్లు వచ్చాయా లేదా అని అడిగారు.
6 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చారన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగబోవన్నారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా చూపించాలన్న అంశం ఆలోచిస్తున్నామన్నారు. గతంలో నాలుగు రోజుల పాటు పెన్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు తాము ఒక్కరోజులేనే ఇచ్చి చూపిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత ఉంటుందని, జవాబుదారీతనం ఉంటుందని పవన్ గుర్తుచేశారు.
సంక్షేమ పథకాలు తప్పనిసరిగా ఇవ్వాలని, దాంతో పాటే అభివృద్ధీ అవసరం అన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో నిధులు ఎటు వెళ్లిపోయాయో తెలియడం లేదన్నారు. 600 కోట్లు పెట్టి రుషికొండ మీద భవనాలు కట్టారని, అదే రూ.600 కోట్లు పెట్టి ఉంటే ఓ జిల్లా అభివృద్ధి చెందేదన్నారు. తనవైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండబోదని హామీ ఇచ్చారు.
తాను క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకుంటే ఏర్పాట్లు ఏం కావాలని అడిగారని, కానీ కొత్త ఫర్నిచర్ కూడా వద్దని, తానే తెచ్చుకుంటానని వారికి చెప్పినట్లు పవన్ వెల్లడించారు. అసెంబ్లీకి వస్తే మూడు, నాలుగు రోజులు కలిపి రూ.35 వేలు మీకు జీతం వస్తాయని చెప్పారని గుర్తుచేశారు. కానీ తాను పంచాయతీ రాజ్ శాఖలో చూస్తే నిధుల్లేవనే విషయం తెలిసిందన్నారు. ఇవన్నీ సరిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకే తాను జీతం తీసుకోనని చెప్పేసినట్లు పవన్ వెల్లడించారు. తాను అద్బుతాలు చేస్తానని చెప్పనని, కానీ చేయగలిగింది మాత్రం చేస్తానని పవన్ తెలిపారు.












Click it and Unblock the Notifications