AP Deputy CM : కూతురుతో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సెల్పీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా పంద్రాగస్టు పండుగ వేడుకలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జెండా ఆవిష్కరించారు. కాకినాడలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ వేడుకకు ఆయన కూతురు ఆద్యతో కలిసి వచ్చారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత డీప్యూటీ సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనం తీసుకున్నారు. ఈ క్రమంలో స్టేజీపై కూతురు ఆద్యతో సెల్పీ తీసుకున్నారు.
కాకినాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూతురు ఆద్యతో కలిసి పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యారు. జెండా ఎగురవేసిన తర్వాత వేదికపై పైకి వచ్చిన పవణ్ కల్యాణ్ తన కూతురు ఆద్య కొణిదెలతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. తన తండ్రి పవన్ కళ్యాణ్ సెల్ఫీ తీస్తుంటే.. కూతురు ఆద్య మాత్రం క్యూట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఇక, ఈ ఫోటోను చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కేడర్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ ఫొటో చూసిన చాలామంది నెటిజన్లు, అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆయన అభిమానులు మాత్రం పవన్‌కళ్యాణ్‌కు కూతురంటే ఎంతో ప్రేమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.













Click it and Unblock the Notifications