Janasena Vs ysrcp: పవన్ కల్యాణ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని AP DGP??
జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వలేదని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నారు. జనసేన కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. వీరిలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఉన్నారు. ఈ కేసుల వివరాలేంటి? కేసులు ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు? ఇవి కోర్టుల్లో నిలుస్తాయా? అనే వివరాలన్నింటినీ పవన్‌కల్యాణ్ సేకరించారు.

రాజకీయంగా ఒత్తిడి కోసమే కేసుల నమోదు?
ఏపీలో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలుంటాయనే ప్రచారం జరగుతుండటంతో జనసేన వైసీపీని టార్గెట్ చేసింది. ఓట్లు చీలిపోనివ్వమని స్పష్టం చేసింది. రాజకీయంగా ఆ పార్టీపై ఒత్తిడి పెంచేందుకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం జనసేన సైనికులపై కేసులు నమోదుచేస్తోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
వీరిపై పెట్టిన కేసులన్నీ వారిపై రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకేనని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. వీటిపై డీజీని కలవాలని పవన్ సమయం కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఆయన స్పందించలేదని, అపాయింట్‌మెంట్ ఇస్తారా? లేదా? అనేది ఇంకా స్పష్టం కాలేదని జనసేన నాయకులు తెలిపారు.

డీజీపీని కలిసేది ఫిర్యాదు చేయడానికే
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసు బాస్ గా ఉన్నవారెవరూ ప్రతిపక్ష నాయకులు వచ్చి వినతిపత్రాలు ఇస్తే తీసుకోవడం ఆపేశారు. తమ కిందిస్థాయి అధికారుల దగ్గరకు వారిని పంపిస్తున్నారు. పవన్‌కల్యాణ్ డీజీపీని కలిసి కేసులకు సంబంధించి ఫిర్యాదు చేయడంతోపాటు తప్పుడుకేసులను తీసేయాలని కోరనున్నట్లు సమాచారం. అయితే పవన్‌కు ఆ అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు జనసేన వర్గాలంటున్నాయి.

ఈసారి ఎన్నికల్లో హోరాహోరీ పోరు?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ వైసీపీ జనసేనాని పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా ఎంచుకున్నట్లు జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. పవన్ కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని సీనియర్ రాజకీయవేత్తలు భావిస్తున్నారు












Click it and Unblock the Notifications