వాట్సాప్ తో ఏపీ డిజిటల్ కార్పోరేషన్ ఒప్పందం - వేగంగా ప్రభుత్వ సమాచారం..!!
ఏపీ ప్రభుత్వం - ప్రజల మధ్య వారధిగా వ్యవహరిస్తున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్ కీలక ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ పథకాలు - కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏపీ డిజిటల్ కార్పోరేషన్ ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇప్పుడు మరింత వేగంగా సమాచారం అందించటం కోసం వాట్సాప్ తో ఒప్పందం చేసుకుంది. ఏపీలో పెరుగుతున్న సామాజిక మాధ్యమాల వినియోగం... ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు వాట్పాప్ తో ఒప్పందం సహకరించనుంది. డిజిటల్ కార్పోరేషన్ కు వాట్సాప్ పూర్తి మద్దతు అందిస్తోంది.
దీని ద్వారా ప్రభుత్వ పథకాలు..నిర్ణయాలు..కార్యక్రమాలను సులువుగా ప్రజలందరికీ అందించేందుకు వాట్సాప్ ను వినియోగించుకోనున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ప్రజలకు వేగంగా .. సంపూర్ణంగా అందిచటంతో పాటుగా సరైన సమాచారం అందిస్తూ...అసత్య ప్రచారాలను నియంత్రించే అవకాశం ఏర్పడిందని డిజిటల్ కార్పోరేషన్ భావిస్తోంది. సీఎం జగన్ అమలు చేస్తున్న ప్రగతి శీల అజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తో కలిసి పని చేయటం పైన ఏపీ డిజిటల్ కార్పోరేషన్ వైస్ ఛైర్మన్.. ఎండీ చిన్న వాసుదేవ రెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య డిజిటల్ వారధిగా ఉండాలనే డిజిటల్ కార్పోరేషన్ లక్ష్యానికి ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇ - గవర్నెన్స్ మరింత మెరుగు పరిచే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయటం గర్వకారణంగా నిలిచిందన్నారు. వైవిధ్యభరితమైన - ప్రతీ అవసరానికి తగిన ఇ - గవర్నెన్స్ పరిష్కారాలు రూపొందించేందుకు ఈ వాట్సప్ వేదిక ద్వారా నిరంతరం పని చేస్తామని వెల్లడించారు. దీంతో..వేగవంతంమైన..సులభతరమైన.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సత్సంబంధాలు నెరిపేందుకు వీలవుతుందని వాసుదేవ రెడ్డి వివరించారు. తాము రూపొందించిన పరిష్కారాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు..నగర పాలక సంస్థలకు అందించి వాటితో కలిసి పని చేసేందుకు తాము నిరంతరం ప్రయత్నిస్తామని వాట్సప్ ఇండియా పబ్లిక్ అధిపతి విశనాథ్ ఠుక్రాల్ ఆశాభావం వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications