ఏపీ ఎంసెట్ నోటిపికేషన్: ఆగస్టు 19 నుంచి 25 వరకు పరీక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎంసెట్ పరీక్షలు ఆగస్టు 19 నుంచి ఆగస్టు 25 వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఒమర్ జలీల్ గురువారం వెల్లడించారు. ఈ మేరకు తాజాగా, నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు గతంలో సూచించిన తేదీలను సవరించి, కొత్త తేదీలను ప్రకటించారు.

తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. అపరాధ రుసుము లేకుండా జూన్ 30వ తేదీ వరకు ఎంసెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని జలీల్ తెలిపారు. రూ. 5వేల ఆలస్య రుసుముతో జులై 7 వరకు, రూ. 10 వేలు అపరాధ రుసుముతో జులై 14 వరకు, రూ. 15 వేలు లేట్ ఫీజుతో జులై 22 వరకు, రూ. 20 వేల అపరాధ రుసుముతో జులై 29 వరకు
దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

Andhra pradesh EAMCET from august 19th to 25th.

కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ
సెంటర్‌ను శానిటైజ్ చేస్తామని, విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఒమర్ జలీల్ స్పస్టం చేశారు.

ఇది ఇలావుండగా, ఐసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, ఎడ్ సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+