ఏపీలో విద్యార్ధులకు బిగ్ రిలీఫ్..! మరో మాట నిలబెట్టుకున్న నారా లోకేష్..!
ఏపీలో గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీల తరపున టీడీపీ నేత నారా లోకేష్ విద్యార్ధులకు, వారి తల్లితండ్రులకు ఓ కీలక హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. వచ్చే నెలలో కొత్త విద్యాసంవత్సరం మొదలుకాబోతున్న నేపథ్యంలో విద్యార్థులపై ఓ భారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాదు దీన్ని అమల్లో కూడా పెట్టేసింది. దీంతో కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్ధులు సంతోషంగా స్కూళ్లకు పరుగులు తీయబోతున్నారు.
రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో విద్యార్ధుల స్కూలు బ్యాగ్ ల భారాన్ని తగ్గిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఇలాంటి హామీలు ఇవ్వడం మామూలే అని అంతా భావించారు. అధికారంలోకి వచ్చాక గతేడాది దీనిపై వెంటనే చర్యలు తీసుకోవడం సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు కొత్త విద్యాసంవత్సరం నుంచి విద్యార్దులపై పుస్తకాల భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది అమల్లోకి కూడా వచ్చేసింది.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 1,2 తరగతుల విద్యార్ధులకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ కలిపి ఒక పుస్తకంగా, వాటి వర్క్ బుక్ లు కలిపి మరో పుస్తకంగా తయారు చేశారు. దీంతో ఈ రెండు తరగతుల విద్యార్ధులు కేవలం రెండు పుస్తకాలను తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే 3,4,5 తరగతుల విద్యార్ధులకు గతంలో నాలుగు బుక్స్, నాలుగు వర్క్ బుక్ లు ఉండేవి. ఇప్పుడు వాటిని కుదించారు. కొత్త విధానంలో తెలుగు--ఇంగ్లీష్ ఒక పుస్తకంలో, మ్యాథ్స్-ఈవీస్ మరో పుస్తకంలో ఉండేలా తయారు చేశారు. వీటి వర్క్ బుక్ లనూ ఇదే విధానంలో ముద్రించారు. దీంతో ఈ మూడు క్లాస్ ల విద్యార్ధులూ 4 పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లనున్నారు.

వాస్తవానికి దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఈసారి మాత్రం నారా లోకేష్ ఓ స్పష్టమైన మార్పు తెచ్చారు. దీంతో విద్యార్దులపై పుస్తకాల భారం సగానికి సగం తగ్గిపోయింది. సెమిస్టర్ విధానం వల్ల కొంత, పుస్తకాలు కలిపేయడం వల్ల మరికొంత భారం తగ్గింది. దీంతో కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్ధులకు భారీ ఊరట దక్కినట్లయింది.












Click it and Unblock the Notifications