చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!

ఏపీలో ప్రధాన పార్టీలు పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. వాటి పైన ఎన్నికల అధికారులు పరిశీలన చేసి నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా సీఎం జగన్ వ్యాఖ్యల పైన టీడీపీ...చంద్రబాబు ప్రసంగాల పైన వైసీపీ ఫిర్యాదులు చేసాయి. వీటి పైన నోటీసులు జారీ అయ్యాయి. అయితే, వారి సమాధానాల పైన సీఈవో సంతృప్తి చెందలేదు. చంద్రబాబు పై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరతూ సీఈవో మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు.

చంద్రబాబు వ్యాఖ్యలతో
ఎన్నికల ప్రచార సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రసంగాల్లో సీఎం జగన్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యల పై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల ప్రధానాధికారి మీనాను కలిసి ఆధారాలు సమర్పించారు. వరుసగా 18 ఫిర్యాదులు చేసింది. వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈవో.. వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నట్లుగా చంద్రబాబు వివరణతో కూడిన సమాధానం ఇచ్చారు. కానీ, వ్యాఖ్యల పైన వీడియోలు అందుబాటులో ఉన్నట్లు సీఈవో వెల్లడించారు.

AP Election CEO Meena letter to CEC over Chandra Babu reply on Comments against YS Jagan

చంద్రబాబుపై చర్యల దిశగా
చంద్రబాబు ఇచ్చిన వివరణ సంతృప్తి కరంగా లేదన్నారు. చంద్రబాబు తన ప్రసంగాల్లో చేస్తున్న వ్యాఖ్యలు..వైసీపీ, ఆ పార్టీ నేతల వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని తెలిపారు. దీని వల్ల ఎన్నికల్లో వైసీపీ సమాన అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. దీంతో, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో వీడియోలను జత చేసినట్లు సీఈవో చెప్పుకొచ్చారు. ప్రసంగాల్లో ఇంకా అనుచిత వ్యాఖ్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పై తదుపరి చర్యలకు సిఫార్సు చేసినట్లు మీనా వెల్లడించారు.

జగన్ పైన ఫిర్యాదులు
ఇదే సమయంలో జగన్ పైన టీడీపీ నేతలు ఫిర్యాదు చేసారు.చంద్రబాబు, పవన్ పైన చేస్తున్న వ్యాఖ్యలు పై అభ్యంతరాలు వ్యక్తం చేసారు. చర్యలు తీసుకోవాలని కోరారు. దీని పైన సీఈవో నోటీసులు ఇచ్చారు. అయినా,.జగన్ తన సభల్లో చేస్తున్న వ్యాఖ్యల పైన ఎన్నికల అధికారులు ఫోకస్ చేసారు.దీంతో..జగన్ కు నోటీసులు..వచ్చిన సమాధానం...జగన్ వ్యాఖ్యల పైన వీడియోలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. తుదపరి చర్యలకు సిఫార్సు చేసారు. దీంతో..ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సీఎం జగన్..చంద్రబాబు పైన తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+