Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP Manifesto: ఎన్డీయే, వైసీపీ మ్యానిఫెస్టోల మధ్య పోలిక, వ్యత్యాసాలివే..!

ఏపీలో వచ్చే ఎన్నికల కోసం అధికార వైసీపీ ఇప్పటికే మ్యానిఫెస్టో విడుదల చేయగా.. ఇవాళ ఎన్డీయే కూటమి కూడా తమ మ్యానిఫెస్టో విడుదల చేసింది. అయితే ఈ రెండు మ్యానిఫెస్టోల్లో కొన్ని కామన్ పాయింట్లు ఉన్నప్పటికీ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ ప్రస్తుతం అందిస్తున్న పథకాల మొత్తాల్ని అవీ కొన్నింటికే పెంచుతూ మ్యానిఫెస్టో ఇవ్వగా.. వాటిని ఇంకాస్త పెంచేస్తూ ఎన్డీయే మ్యానిఫెస్టో ఇచ్చింది. అలాగే మరికొన్ని అంశాల్లోనూ పోలికలు, వ్యత్యాసాలున్నాయి.

వైసీపీ తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో వృద్ధాప్య పెన్షన్లను ప్రస్తుతం ఉన్న రూ.3 వేల నుంచి వచ్చే ఐదేళ్లలో రూ.3500కి పెంచుతామని హామీ ఇచ్చారు. ఇందులో రూ.250 2028 జనవరిలో, మరో రూ.250 2029 జనవరిలో పెంచుతామన్నారు. కానీ ఇవాళ ఎన్డీయే మ్యానిఫెస్టోలో ప్రస్తుతం ఉన్న పెన్షన్లను ఈ ఏప్రిల్ నుంచే రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే వికలాంగుల పెన్షన్లు రూ.6 వేలకు, పూర్తిగా వికలాంగులైతే రూ.10 వేలకు పెంచి ఇస్తామన్నారు.

AP Elections 2024 nda alliance manifesto versus ysrcp manifesto- who promise for what

అలాగే వైసీపీ మ్యానిఫెస్టోలో ప్రస్తుతం విద్యార్ధుల తల్లులకు ఇస్తున్న రూ.15 వేల అమ్మఒడి మొత్తాన్ని తాము అధికారంలోకి వస్తే 2 వేలు పెంచి రూ.17 వేల చొప్పున ఇస్తామన్నారు. కానీ ఎన్డీయే మ్యానిఫెస్టోలో కుటుంబంలో ముగ్గురు పిల్లల వరకూ రూ.15 వేల చొప్పున అంటే గరిష్టంగా రూ.45 వేల వరకూ ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ మ్యానిఫెస్టోలో రైతు భరోసా మొత్తాన్ని ఏడాదికి రూ.16 వేలకు పెంచుతామన్నారు. కూటమి మాత్రం ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ప్రకటించింది.

వైసీపీ మ్యానిఫెస్టోలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు చేయూత పథకం ద్వారా ఇచ్చే మొత్తం ఐదేళ్లలో 75 వేలు కొనసాగిస్తామని హామీ ఇవ్వగా.. ఎన్డీయే కూటమి మాత్రం 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని ప్రకటించింది. వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు రాజధానులు అమల్లోకి తెస్తామని ప్రకటించగా.. ఎన్డీయే కూటమి అమరావతే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పింది.

వైసీపీ మ్యానిఫెస్టోలో లా నేస్తం, కాపునేస్తం, వాహనమిత్ర పథకాలు కొనసాగిస్తామని, అలాగే ఈబీసీ నేస్తాన్ని రూ.45 వేల నుంచి లక్షా 5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఎన్డీయే మ్యానిఫెస్టోలో బీసీలకు సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని మాత్రమే ప్రకటించింది. అలాగే వైసీపీ మ్యానిఫెస్టోలో లేని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు, మెగా డీఎస్సీ, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలు ఎన్డీయే మ్యానిఫెస్టోలో ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+