Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో సీపీఎస్ రద్దు లేనట్లే-మంత్రుల క్లారిటీ-కేబినెట్ పై చివరి ఆశలు-తేలకపోతే ఛలో విజయవాడ

ఏపీలో వైసీపీ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇది సాధ్యం కాదని తేల్చిచెప్పేస్తోంది. అయినా తమ వంతు ప్రయత్నం చేశామని చెప్పుకునేందుకు పదే పదే చర్చలకు ఆహ్వానిస్తోంది. సీపీఎస్ రద్దుపై చర్చిద్దామని ఏకంగా మంత్రులు పిలుస్తుండటంతో ఉద్యోగులు చర్చలకు వెళ్తున్నారు. కానీ అక్కడకు వెళ్లగానే జీపీఎస్ పై చర్చిద్దామంటున్నారు. దీంతో ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. ఈ ప్రహసనానికి ఇవాళ తెరపడే అవకాశముంది.

 సీపీఎస్ రద్దు డిమాండ్

సీపీఎస్ రద్దు డిమాండ్

ఏపీలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఉద్యోగులకు అమలు చేస్తున్న సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం) రద్దు చేయాలనే డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. జగన్ పాదయాత్ర సందర్భంగా ఉద్యోగులకు దీనిపై హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు కూడా గంపగుత్తగా ఓట్లేశారు. కానీ జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ హామీపై కసరత్తు చేయలేదు. ఛలో విజయవాడ రూపంలో ఉద్యోగుల పెట్టిన ఒత్తిడితో స్పందించిన ప్రభుత్వం.. సీపీఎస్ రద్దు కష్టమేనని చెప్పేసింది. అప్పట్లో తెలియక హామీ ఇచ్చామన్న సజ్జల వ్యాఖ్యలు ఉద్యోగులకు మంట పుట్టించాయి. అప్పటి నుంచి పలుదఫాలు చర్చలు జరిగినా సీపీఎస్ స్ధానంలో జీపీఎస్ తెచ్చేందుకే ప్రభుత్వం మొగ్గుచూపడంలో అవి కాస్తా విఫలమయ్యాయి.

ఛలో విజయవాడ పిలుపుతో

ఛలో విజయవాడ పిలుపుతో

ఏపీలో ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేయడం ఇక అసాధ్యమని భావించిన ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడ పిలుపు ఇచ్చాయి. గతంలో ఛలో విజయవాడ విజయవంతం కావడంతో మరోసారి ఇదే కార్యక్రమం చేపట్టాలని భావించాయి. సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ నిర్వహించి సీఎం జగన్ నివాసం ముట్టడిస్తామని ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని ముందస్తు అరెస్టులు, బైండోవర్లు చేసేసింది. అదే సమయంలో వినాయకచవితి పండుగ కూడా రావడంతో ఉద్యోగసంఘాలు దీన్ని సెప్టెంబర్ 11కు వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు ఆ సమయం కూడా దగ్గరపడుతుండటంతో ఉద్యోగులు పోరుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వం కూడా చర్చల పేరుతో వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది.

సీపీఎస్ అని పిలిచి జీపీఎస్ పై చర్చలు

సీపీఎస్ అని పిలిచి జీపీఎస్ పై చర్చలు


సీపీఎస్ రద్దుపై చర్చిద్దామని ఉద్యోగసంఘాల నేతలకు మంత్రులు కబురుపెడుతున్నారు. తీరా చర్చలకు వచ్చి కూర్చున్నాక జీపీఎస్ పై చర్చిద్దామని మంత్రులు చేస్తున్న ప్రతిపాదన సహజంగానే ఉద్యోగులకు మంటపుట్టిస్తోంది. జీపీఎస్ పై చర్చలకు అయితే తమను మరోసారి పిలవద్దంటూ నేరుగా వారు మంత్రులకే చెప్పేస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. నిన్న కూడా చర్చలు జరిగితే అందులో సీపీఎస్ రద్దుపై చర్చిస్తారనుకుని వెళితే మళ్లీ జీపీఎస్ గురించి మంత్రులు మాట్లాడారని ఉద్యోగసంఘాల నేతలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 కేబినెట్లో తేలకపోతే ఛలో విజయవాడ ?

కేబినెట్లో తేలకపోతే ఛలో విజయవాడ ?


ఇవాళ సీఎం వైఎస్ జగన్ కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఇందులో పలు అంశాలు చర్చకు రానున్నాయి. ఇందులో సీపీఎస్ కూడా ఒకటి. ఉద్యోగులకు ఇచ్చిన హామీపై వారు పట్టుబడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ మంత్రుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. సాధ్యం కాకపోతే మాత్రం ప్రభుత్వం ఈ విషయాన్ని ఇక సూటిగా చెప్పేసేందుకు సిద్దమవుతోంది. అదే జరిగితే ఉద్యోగులు సాయంత్రం మంత్రుల కమిటీ చర్చలకు వెళ్లడం కూడా కష్టమే. అలా కాకుండా ఉద్యోగులతో చివరి సారిగా మాట్లాడాలని జగన్ సూచిస్తే మాత్రం సాయంత్రం చర్చలు ఉంటాయి. కానీ కేబినెట్లో రాని క్లారిటీ ఆ తర్వాత ఉద్యోగులకు మంత్రులు ఇవ్వడం కూడా కష్టమేనని భావించవచ్చు. దీంతో సెప్టెంబర్ 11న యథాతథంగా ఛలో విజయవాడ నిర్వహణకు ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+