ధూళిపాళ్ల నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం : ట్రస్టు స్వాధీనానికి నోటీసులు..!!
టీడీపీ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పైన ప్రభుత్వం మరో సారి ఫోకస్ పెట్టింది. ఈ సారి ఆయన ట్రస్టుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ ఛైర్మన్ గా వ్యవహరించటంతో తన తండ్రి పేరుతో దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది నెలల క్రితం సంగం డైరీలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ ఏసీబీ అధికారులు దూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసారు. ఆ తరువాత ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు. దీని పైన న్యాయస్థానంలో కేసు కొనసాగుతోంది.

సంగం డైరీ స్వాధీనానికి ప్రభుత్వ ప్రయత్నం
సంగం డైరీ స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని పైన సంగం డైరీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసింది. ఇక, ఇప్పుడు దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని సిక్స్ ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ ఈ నోటీసులను జారీ చేశారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు.

డీవీసీ ట్రస్టు స్వాధీనానికి నోటీసులు
డీవీపీ ట్రస్టు ద్వారా డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది. తాము ఈ ఆస్పత్రి ద్వారా పాల రైతుల కుటుంబాలకు రాయితీ ధరకే వైద్య సేవలు అందిస్తున్నామని నరేంద్ర మద్దతు దారులు చెబుతున్నారు. కరోనా సమయంలోనూ తమ ఆస్పత్రి ద్వారా అందించిన సేవలను గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఈ విధంగా వెంటాడుతోందనేది వారి ఆరోపణ. అయితే, అధికార పార్టీ నుంచి నేతలెవరూ దీని పైన ఇంకా స్పందించ లేదు. దేవాదాయ శాఖ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు నరేంద్ర సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

తండ్రి పేరుతో నరేంద్ర ట్రస్టు నిర్వహణ
అయితే, రాజకీయంగా ఇప్పుడు ఈ వ్యవహారం మరో వివాదానికి కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీని పైన టీడీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు...నోటీసులు పేర్కొన్న అంశాలు..వాటికి నరేంద్ర సమాధానాలు..వీటికి మరింత స్పష్టత రావాల్సి ఉంది. ధూరళిపాళ్ల నరేంద్ర అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వం అధికారం లో ఉన్నా లేకున్నా..టీడీపీ వాయిస్ నరేంద్ర బలంగా వినిపించే వారు.
Recommended Video

నోటీసుల పైన వారం రోజుల్లో సమాధానం
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తన కంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వటం..తనకు ప్రాధాన్యత లేకపోవటం పైన నరేంద్ర చాలా రోజులు పార్టీ అధినాయకత్వం పైన అలక బూనారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి వరుసగా ఎదురవుతున్న కేసుల విషయంలో మాత్రం పార్టీ నుంచి మద్దతు అందుతోంది. ఇక, ఇప్పుడు ప్రభుత్వ తాజా నోటీసుల వ్యవహారం పైన స్పందన ఏ రకంగా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications