దుర్గమ్మ దర్శనంకు వచ్చే భక్తులకు బిగ్ అప్డేట్ - అమల్లోకి కొత్త విధానం..!!
ఇంద్రకీలాద్రి లో భక్తుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఇంద్రకీలాద్రి వేదికగా చోటు చేసుకున్న పొరపాట్ల పైన విచారణ మొదలు పెట్టారు. కాగా, భక్తులకు దర్శనం తో పాటుగా సేవలు మరింత సులభంగా పొందేలా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. భక్తుల కోసం ఆన్‌లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది. దర్శన టిక్కెట్లు, సేవా పూజలు, ప్రసాదం, వసతి గదుల బుకింగ్ వంటి అనేక సేవలను ఇకపై ఆన్‌లైన్ ద్వారా పొందే విధంగా కొత్తగా మార్పు లు చేసారు.
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కల్పించేలా దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. కనకదుర్గ భక్తులకు ఆన్‌లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది. దర్శన టిక్కెట్లు, సేవా పూజలు, ప్రసాదం, వసతి గదుల బుకింగ్ వంటి అనేక సేవలను ఇకపై ఆన్‌లైన్ ద్వారా పొందే విధంగా మార్పులు చేసింది. తాజా నిర్ణయం ద్వారా ఇక నుంచి భక్తులు
క్యూ లైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ డిజిటల్ సేవలను ప్రవేశపెట్టినట్లు దేవాదాయ శాఖ వెల్లడించింది. అదే విధంగా చెల్లింపులు అన్ని డిజిటలైజేషన్ చేసే విధంగా కొత్త మార్పులు తీసుకొచ్చారు. దర్శనం.. సేవల కోసం వాట్సాప్ నంబర్ 9552300009ను వినియోగించుకోవాలని సూచించింది. దర్శనం, ప్రసాదం, పూజా సేవల వివరాలు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపింది.

అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తు బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. భక్తులు తమకు కావాల్సిన వివరాల కోసం వెబ్‌సైట్ : www.aptemples.ap.gov.in లో సంప్రదించాలని సూచించింది. శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయని వెల్లడించింది. అమ్మవారికి నిర్వహించే ఆర్జిత సేవలు ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా పొందవచ్చని సూచించింది. దేవస్థాన వసతి గదుల కేటాయింపు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో ప్రత్యేక డిజిటల్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. QR కోడ్, కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపుల సౌకర్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. దళారులను నమ్మవద్దని దేవస్థానం అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం కల్పించిన అధికారిక సేవలనే వినియోగించుకోవాలని భక్తులకు అధికారులు కీలక సూచన చేసారు.












Click it and Unblock the Notifications