Big Breaking:అచ్చెన్నాయుడు అరెస్టు ,ఈఎస్ఐ స్కాంలో ఆధారాలు పక్కా..టీడీపీకి భారీ షాక్
టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలను తవ్వితీస్తున్న జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాల దిశగా వెళుతోంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఫైబర్ నెట్, రంజాన్ తోఫా చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ చేయించాలని నిర్ణయంచింది . ఇదే సమయంలో ఏపీలో జరిగిన ఈఎస్ఐ ఆస్పత్రుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై కూడా ఫోకస్ చేసింది. అందులో భాగంగా నాడు టీడీపీ హయాంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఆ తర్వాత కార్మిక మంత్రి అయిన పితాని సత్యనారాయణ ప్రమేయంపైనా ప్రభుత్వం లోతుగా విచారణ చేస్తోంది.

మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి
తెలంగాణలో దేవికారాణి వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈఎస్ఐ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై గత 10 రోజులుగా దర్యాప్తులో వేగం పుంజుకుంది. దాదాపు రూ.200 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే తాజాగా ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్లను ఏసీబీ విచారణ చేసింది. కొందరు ప్రైవేట్ వ్యక్తులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నామినేషన్ పద్ధతిలో పరికరాలు మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసినట్లు విచారణలో గుర్తించారు.

అచ్చెన్నాయుడు ప్రమేయం
ఈ మొత్తం వ్యవహారంలో అప్పుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ప్రమేయంపైనే ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. రూ.38 కోట్లు విలువైన మందులను రూ. 90 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అవసరమైన పరికరాలు వాస్తవ ధరకంటే ఐదేళ్ల కాలంలో రూ.150 కోట్లు ఎక్కువగా వెచ్చించినట్లు అధికారులు నివేదికలో నిగ్గు తేల్చారు. ఈ మొత్తం వ్యవహారంపైన ప్రభుత్వం పెద్దలకు పూర్తి నివేదిక ఇచ్చారు. అందులో ప్రధానంగా అచ్చెన్నాయుడు పాత్ర పైన లోతుగా విచారణ చేసిన ఏసీబీ కొన్ని ఆధారాలు సైతం సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో గతంలో కార్మిక శాఖలో పనిచేసిన ముఖ్య అధికారులతో పాటు అచ్చెన్నాయుడిని విచారణకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే టెక్కలిలో ఉన్న అచ్చెన్నాయుడిని విచారణ చేసి అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

దొరికిన ఆధారాలు
తిరుపతిలోని ఒక డాక్టరును విచారణ చేసిన సమయంలో అచ్చెన్నాయుడి జోక్యంపై ఆధారాలు దొరికినట్లు చెబుతున్నారు. ఏసీబీ చేసిన విచారణలో నాటి మంత్రి పేషీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే భారీ నిధులతో పరికరాలు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ రోజున ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అచ్చెన్నాయుడు టార్గెట్‌గా ఏసీబీ వేస్తున్న అడుగుల్లో ఆయన చిక్కుకోవడం ఖాయమని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ రోజున ఏసీబీ ఈఎస్ఐ స్కామ్ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనేది మరెంత మంది అధికారులు వలలో చిక్కుతారనేది హాట్ టాపిక్‌గా మారింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications