లైన్ కట్టి మద్యం కొంటున్నప్పుడు, తప్పేంటి: ఏపీ మంత్రి సంచలనం
మద్యం దుకాణాల ముందు పెద్ద పెద్ద వరుసలు కట్టి, కొనే వారు ఉన్నప్పుడు అమ్మితే తప్పేమిటని మంత్రి జవహర్ అన్నారు.
అమరావతి: మద్యం దుకాణాల ముందు పెద్ద పెద్ద వరుసలు కట్టి, కొనే వారు ఉన్నప్పుడు అమ్మితే తప్పేమిటని ఏపీ మంత్రి జవహర్ సోమవారం ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. మద్యం అమ్మకాలపై ఆయన మాట్లాడారు.
మద్యం దుకాణాల రెన్యూవల్ పైన తాము దృష్టి సారించామని చెప్పారు. మంగళవారంలోగా శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. అది సాధ్యం కాకపోతే తాత్కాలికంగా లైసెన్సుల పునరుద్ధరణ చేస్తామన్నారు.

ఇప్పటి వరకు 23 శాతం దుకాణాలు, 11 శాతం బార్ల లైసెన్సులు రెన్యూవల్ అయ్యాయని చెప్పారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు పెడుతున్నారని ఆందోళన చెందవద్దని చెప్పారు.
దీనిపై మహిళా ప్రతినిధి బృందాలను పంపితే తాము మాట్లాడుతామని చెప్పారు. మహిళల మనోభావాలను తాము గౌరవిస్తామన్నారు. ఊళ్లలో మద్యం దుకాణాలు వద్దని ఆడపడుచులు కోరితే ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications