రోజుకు రూ.1000.. ఉచిత బస్సు ప్రయాణంతో వారి జీవితాల్లో వెలుగులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళల కోసం స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తుంది. ఆగస్టు 15వ తేదీ నుండి ఈ ఉచిత బస్సు పథకం అమలవుతోంది. ఈ పథకం ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైనప్పటి నుండి ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో apsrtc కి అవసరమైన మార్గాలలో అదనపు బస్సులను కూడా నడపాల్సిన అవసరం ఏర్పడింది.
ఉచిత బస్సు పథకం వల్ల వారికి ఉపాధి
దీనివల్ల పలువురికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్న పరిస్థితి ఉంది. ఏపీలో ఉచితబస్సు ప్రయాణ సౌకర్యం కారణంగా ప్రయాణాలు చేసే వారి రద్దీ పెరగడంతో కొన్ని మార్గాలలో అదనపు బస్సులను నడుపుతున్నారు. కొన్ని డిపోలలో డ్రైవర్ల కొడుతున్న తీర్చడం కోసం ఆన్ కాల్ డ్రైవర్లను నియమించి బస్సులు నడుపుతున్నారు.

అదనపు బస్సులు ఆన్ కాల్ డ్రైవర్ లు
గతంలో అదనపు బస్సులు నడిపే డ్రైవర్లకు ఎనిమిది వందల రూపాయలు ఇస్తే ఇప్పుడు ఆ వేతనాన్ని పెంచి రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆన్ కాల్ డ్రైవర్లకు ఉపాధిని ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మీరు పని చేసే చోటును బట్టి వేతనం కూడా మారుతుంది.
రోజుకు వారికి వెయ్యి.. ఆ మార్గాల్లో ఇంకా ఎక్కువ
ఉదాహరణకు కర్నూలు మార్గంలో ఆన్ కాల్ డ్రైవర్లకు వెయ్యి రూపాయలు ఇస్తే, తిరుపతి మార్గంలో 1300 రూపాయలు, రాజంపేట మార్గంలో 1430 వేతనాన్ని అందిస్తున్నారు. ఇది ఎంతో మందికి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేయాలనుకునే వారికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు, కనీసం మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వారం రోజుల శిక్షణ ఇచ్చి విధుల్లోకి
ఇందులో ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణను వారం రోజులపాటు ఇచ్చి ఆపై విధుల్లోకి తీసుకుంటారు. ఏది ఏమైనా ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం కొంతమందికి ప్రత్యక్షంగాను, మరికొంతమందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆర్టీసీకి ప్రయాణ రద్దీని బాగా పెంచింది.












Click it and Unblock the Notifications