Free Bus ఏపీలో ప్రారంభమైన కొత్త పథకం, వారికి కూడా ఇంద్రధనస్సు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. మహిళల కోసం ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్న 'స్త్రీ శక్తి' పథకం తరహాలోనే, దివ్యాంగుల కోసం 'ఇంద్రధనస్సు' పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని నేటి అందుబాటులోకి తెచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం 'ఇంద్రధనస్సు' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ వెసులుబాటు కలుగుతుంది. ఫిబ్రవరి 24న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోగా, నేటి నుంచి ఇది అధికారికంగా అమలులోకి వచ్చింది.

AP Free Bus Travel for Disabled CM Chandrababu Launches Indradhanusu Scheme for PwDs from March 1

Free Bus పథకం వివరాలు - అర్హతలు:

ఈ పథకం కింద 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారు ఎటువంటి టికెట్ ఛార్జీ చెల్లించకుండా ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో లబ్ధిదారులు ప్రభుత్వం జారీ చేసిన సదరం (SADAREM) సర్టిఫికెట్ లేదా స్మార్ట్ కార్డ్ ను కండక్టర్‌కు చూపించి 'జీరో టికెట్' పొందవచ్చు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో సిటీ బస్సుల్లో మాత్రమే ఉన్న ఈ ఉచిత సౌకర్యం, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు రకాల బస్సు సర్వీసులకు విస్తరించబడింది.

ఉచిత ప్రయాణం వర్తించే బస్సులు..

దివ్యాంగులు మొత్తం ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ మరియు సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. అయితే, లగ్జరీ మరియు సుదూర ప్రాంతాలకు వెళ్లే నాన్‌స్టాప్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, మరియు అంతర్‌రాష్ట్ర (ఇంటర్‌స్టేట్) బస్సుల్లో మాత్రం గతంలో ఉన్నట్లే 50 శాతం రాయితీ కొనసాగుతుంది.

ఇంద్రధనస్సు - ఏడు వరాల ప్యాకేజీ..

ముఖ్యమంత్రి ప్రకటించిన 'ఇంద్రధనస్సు'లో ఉచిత బస్సు ప్రయాణం ఒక భాగం మాత్రమే. దీంతో పాటు దివ్యాంగుల కోసం అమరావతిలో 'దివ్యాంగ్ భవన్' ఏర్పాటు, స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవులు, గృహ నిర్మాణ పథకాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు వంటి ఏడు కీలక హామీలను ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 11 లక్షల మంది దివ్యాంగులలో ప్రస్తుతం కేవలం 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీ పాస్‌లను ఉపయోగిస్తుండగా, ఈ కొత్త నిర్ణయంతో మిగిలిన వారందరికీ భారీ ఆర్థిక ఊరట లభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+