ఏపీ ఉచిత బస్సు ప్రయాణ పథకంతో రోజుకు రూ.వెయ్యి, వాళ్ళు నక్కతోక తొక్కారు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళల కోసం అమలవుతున్న ఈ పథకం అటు మహిళలకు మాత్రమే కాకుండా, వీటి మీద ఆధారపడిన ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తోంది.
ఆర్టీసీ అదనపు బస్సుల కోసం ఆన్ కాల్ డ్రైవర్లు
స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం, బస్సులో రద్దీ పెరగడంతో అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తోంది. జిల్లాల వారీగా రద్దీకి తగిన విధంగా అదనపు బస్సులను నడుపుతున్నారు. అయితే అదనపు బస్సులకు తగ్గట్టుగా ఆర్టీసీలో అదనపు డ్రైవర్లు లేకపోవడంతో, ఆర్టీసీ అధికారులు ఆన్ కాల్ డ్రైవర్లను కూడా నియమిస్తున్నారు.

రోజుకు వెయ్యి రూపాయల వేతనంతో వారికి ఉపాధి
గతంలో వారికి రోజుకు ఎనిమిది వందల రూపాయల వేతనం ఇచ్చారు. అయితే ఇప్పుడు వారికి రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున వేతనాన్ని అందిస్తున్నారు. ఈ ఆన్ కాల్ డ్రైవర్లకు శిక్షణ నిచ్చి విధులకు పంపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రతిచోట ఆన్ కాల్ డ్రైవర్లకు అవకాశం కల్పిస్తూ ఉండడం, ఆర్టీసీ ద్వారా మరికొంత మందికి ఉపాధి కల్పించటమే అని చెప్పవచ్చు.
స్త్రీశక్తి పథకంతో వారికి పెరిగిన డిమాండ్
ఇప్పటికే ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు అదనపు డ్యూటీలు చేస్తే అలవెన్స్ పెంచి ఇస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఆన్ కాలర్ డ్రైవర్లకు కూడా రోజువారి వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు. స్త్రీ శక్తి పథకానికి ముందు రెగ్యులర్ డ్రైవర్లకు డబల్ డ్యూటీ చేస్తే ఎనిమిది వందల రూపాయలు, కండక్టర్లకు 700 రూపాయలు ఇచ్చేవారు, అయితే ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి డ్రైవర్లకు వెయ్యి రూపాయలు, కండక్టర్లకు 900 రూపాయలను ఇస్తున్నారు.
వారికి మేలు చేస్తున్న చంద్రబాబు సర్కార్
ఇక ప్రస్తుతం ఆన్ కాల్ డ్రైవర్లకు కూడా రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తూ ఉండడం వారికి మేలు చేస్తుంది. ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అవకాశంతో ఆన్ కాల్ డ్రైవర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తున్నందుకు, స్త్రీ శక్తి పథకం తమకు ఉపాధి అవకాశాలు కల్పించినందుకు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications