బోటు ప్రమాదం: సాగర్ టూ శ్రీశైలం బోట్ల రద్దు, ''బాబు షూ వల్లే ఇదంతా''..

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఫెర్రీ బోటు ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. కృష్ణానదిలో బోటు మునిగిపోయి 22 మంది మరణించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పోలీస్ అధికారులను ఆదేశించారు. మరో వైపు నాగార్జున సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని కూడ నిలిపివేశారు.

Krishna River Boat Mishap : Chandrababu's Assurance To Victims | Oneindia Telugu

బోటు ప్రమాదం: డ్రైవర్ గేదేల శ్రీనుపై వేటు, నిర్లక్ష్యమే కారణం

ఆదివారం నాడు కృష్ణానదిలో బోటు మునిగిపోయింది. ఒంగోలుకు చెందిన వాకర్స్ క్లబ్ సభ్యులు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విహరయాత్రకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోతే, అందులో 17 మంది ఒంగోలు పట్టణానికి చెందినవారే ఉన్నారు.

బోటు ప్రమాదం: 17 మందిది ఒంగోలు, ఆ 4 కుటుంబాల్లో విషాదం

ప్రమాదానికి గల కారణాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా జిల్లా కలెక్టర్ నివేదికను మంగళవారం నాడు అందజేశారు. బోటును నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం వాటిల్లిందని ఆ నివేదికలో కలెక్టర్ చెప్పారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ఫెర్రీ ప్రమాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.ఫెర్రీ ప్రమాదం చోటుచేసుకొన్న నేపథ్యంలో పర్యాటక, నీటి పారుదల శాఖాధికారులు, పోలీసులతో చంద్రబాబునాయుడు సమావేశం నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పర్యాటక ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.

నిపుణులతో కమిటీ ఏర్పాటు

నిపుణులతో కమిటీ ఏర్పాటు


భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అనుభవజ్ఞులైన నిపుణులతో కమిటీ వేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. అంతర్జాతీయంగా ఖ్యాతి ఉన్నవారి పేర్లను పరిశీలించాలని డీజీపీ, సీఎస్‌ దినేష్‌కుమార్‌ను ఆదేశించారు.ఈ కమిటీలో ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్‌తో పాటు ఇతర అధికారులను నియమించినట్టు సమాచారం.పర్యాటక ప్రాంతాల్లో బోట్ల ప్రయాణంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది.బోటు ప్రమాద సంఘటనపై విచారణ రేపు ఉదయం నుంచి విచారణ ప్రారంభించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను గురించి వారు తెలిపారు. రివరెండ్‌ పోలీసింగ్, సింగిల్‌ విండో అనుమతులు ఎలా ఇచ్చారన్న విషయంపై కమిటీ పరిశీలిస్తుంది.

 సాగర్ టూ శ్రీశైలం లాంచీల రద్దు

సాగర్ టూ శ్రీశైలం లాంచీల రద్దు

ఫెర్రీ ప్రమాదం తర్వాత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. సాగర్‌-శ్రీశైలం లాంచీ ప్రయాణం రద్దు చేస్తున్నామని లాంచ్‌ స్టేషన్‌ మాస్టర్ తెలిపారు.
టూరిజంశాఖ ఉన్నతాధికారుల ఆదేశంతో సాగర్‌ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణాలు రద్దు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మరల ఎప్పుడూ లాంచ్ ప్రయాణం కొనసాగించే విషయమై స్పష్టత లేదని ఆయన ప్రకటించారు. అయితే జాగ్రత్తలు తీసుకొన్న తర్వాతే ఈ మార్గంలో లాంచీ ప్రయాణాలను పునరుద్దరించే అవకాశాలు లేకపోలేదు.

'ఫెర్రీ ప్రమాదానికి బాబే కారణం'

'ఫెర్రీ ప్రమాదానికి బాబే కారణం'


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షూ వేసుకుని కృష్ణా హారతిలో పాల్గొనడంవల్లే బోటు ప్రమాదం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో షూ తోనే ఆయన పుష్కర స్నానం చేశారని, అప్పుడు తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు బూట్లు విడిచిపెట్టాలని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap governament constitued a expert committee for boat transport in tourism places.Ap Chief minister Chandrababu naidu conducted a review with officials at Amaravati on Tuesday evening.
Please Wait while comments are loading...