వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP Extends Lock Down Till జూన్ 20: మధ్యాహ్నం 2 గంటల వరకూ మినహాయింపు

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయాలు ప్రకటించింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో కోవిడ్‌ నేపథ్యంలో విధిస్తూన్న పగటి పూట కర్ఫ్యూతో పాటు సమయాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
కరోనా కేసులు పూర్తిగా తగ్గనందున కర్ఫ్యూని జూన్‌ 20 వరకూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో కరోనా కేసుల ఉధృతి తగ్గుతున్నా ఇంకా పరిస్దితి పూర్తిగా అదుపులోకి రాలేదు. దీంతో ప్రభుత్వం కరోనా కేసులు తగ్గేవరకూ కర్ఫ్యూ పొడిగించడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు అధికారుల నుంచి వచ్చిన నివేదికలు పరిశీలించిన సీఎం జగన్.. కర్ఫ్యూను జూన్‌ 20 వరకూ పొడిగిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కర్ఫ్యూ మినహాయింపుల సమయాన్ని మరో రెండు గంటలు పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ap governement extends day curfew till june 20, relaxation time extended to 2 pm

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా దృష్ట్యా విధిస్తున్న పగటి పూట కర్ఫ్యూ జూన్ 10 వరకూ అమల్లో ఉంది. అలాగే మినహాయింపు సమయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉంది. దీన్ని జూన్‌ 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పెంచుతున్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే సమయాన్ని సైతం మధ్యాహ్నం 2 గంటల వరకూ పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్‌ 11 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పులు జూన్‌ 20 వరకూ అమల్లో ఉంటాయి. ఆ తర్వాత ప్రభుత్వం పరిస్ధితిని మరోసారి సమీక్షించి తదనుగుణంగా తదుపరి నిర్ణయం ప్రకటించనుంది.

English summary
andhrapradesh government has extended day curfew in the state till june 20. and relaxation timings has been increased upto 2pm daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X