ఏపీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ- 18 నుంచి 45 ఏళ్ల వారికి ఉచిత వ్యాక్సిన్
ఏపీలో కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ కోవిడ్ పరిస్ధితిపై కీలక సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇందులో రేపటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూతో పాటు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఉచిత వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించారు.
Recommended Video
ఏపిలో ప్రస్తుతం రోజుకు దాదాపు 10 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే గత రికార్డులను కూడా రాష్ట్రం తుడిచిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాజిటివిటీ రేటులో గతేడాది రికార్డు బద్దలైంది. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ రేపటి నుంచి రాత్రి పూట కర్ప్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

మరోవైపు మే 1 నుంచి ప్రారంభం కానున్న మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమంపైనా సీఎం జగన్ సమీక్షించారు. 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించిన కేంద్రం.. తయారీ సంస్ధల నుంచి రాష్ట్రాలనే వ్యాక్సిన్లు కొనుక్కోవాలని తేల్చేసిన నేపథ్యంలో ఆ భారాన్ని భరిస్తూ ఉచితంగా వ్యాక్సిన్లు వేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీంతో మే 1 నుంచి 18 నుంచి 45 ఏళ్ల మధ్యన ఉన్న వారికి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నట్లుగానే ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వబోతోంది. 45 ఏళ్లు పైబడిన వారికి ఎలాగో కేంద్రం ఉచితంగానే వ్యాక్సిన్లు సరఫరా చేస్తోంది.












Click it and Unblock the Notifications