ఎయిడెడ్ పై ప్రభుత్వ నిర్ణయంలో మార్పులు - రచ్చకు ముగింపు : విలీనంపై నాలుగు ఆప్షన్లు..!!
కొంత కాలంగా రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం వ్యవహారం పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొనసాగుతన్న చర్చకు ముగింపు పలికింది. తాజాగా ఎయిడెడ్ విలీనం పైన నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ పార్టీలు..విద్యార్ధి సంఘాల ఆందోళనకు ముగింపు పలికింది. ఎయిడెడ్ కొనసాగిస్తూ..లేఖలు వెనక్కు తీసుకోవటానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ ఆస్తుల కోసమే ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందనే ఆరోపణలకు చెక్ పెట్టింది.

తాజా ఉత్తర్వుల్లో స్పష్టత
ఇప్పుడు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో ఇక ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో అనుమాలు..సందేహాలకు అవకాశం లేకుండా ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యా సంస్థలకు పునరాలోచనకి అవకాశమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎయిడెడ్ విద్యాసంస్దల విలీనంపై నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

నాలుగు ఆప్షన్లతో ప్రభుత్వ ఉత్తర్వులు
అందులో ప్రధానంగా ..మొదటి ఆప్షన్‌గా ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులతో సహా ఎయిడెడ్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులని, స్టాఫ్ ని పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించడం. కాగా, రెండవ ఆప్షన్‌గా విద్యాసంస్థల ఆస్థులు కాకుండా కేవలం మంజూరు అయిన ఉపాద్యాయ పోస్టులని, స్టాఫ్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగించడం.
ఇక, మూడవ ఆప్షన్‌గా మొదటి రెండు ఆప్షన్‌లకు వ్యతిరేకంగా పూర్తిగా ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగించడం. వీటితో పాటుగా నాలుగవ ఆప్షన్‌గా మొదటి, రెండు ఆప్షన్‌లలో ఇప్పటికే ఎంచుకుని ప్రభుత్వానికి విలీనం చేయడానికి అంగీకరించిన విద్యాసంస్థలకి పునరాలోచన కల్పిస్తూ విలీనంపై అంగీకారానికి వెనక్కి తీసుకుని పూర్తిగా ఎయిడెడ్ విద్యాసంస్థగా నడుపుకోవడానికి అవకాశం ఇచ్చింది.

వివాదాలు..ఆరోపణలకు ముగింపు
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2249 ఎయిడెడ్ విద్యాసంస్థలలో 68.78% మొదటి రెండు ఆప్షన్‌లకు స్వచ్చందంగా అంగీకరించాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,600 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. 702 ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని స్పష్టీకరించింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని స్పష్టం చేసింది. తాజాగా మరోసారి విలీనానికి అంగీకరించిన ఎయిడెడ్ విద్యా సంస్ధలు తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకునే వెసులు బాటు కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Recommended Video

సవరణ నిర్ణయంతో ఎయిడెడ్ కు రిలీఫ్
వీలైనంత త్వరగా ఎయిడెడ్ విలీన ప్రక్రియ ముగించడానికి పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, సాంకేతిక శాఖ, ఇంటర్ బోర్డులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అనంతపురంలో విద్యార్ధుల ఆందోళన... విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం అడ్డుకోవటంతో పాటుగా రాజకీయంగానూ ప్రభుత్వం పైన ఆరోపణలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. ఇక, ఇప్పుడు తాగాజా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ఈ వివాదం ముగిసిపోనుంది.












Click it and Unblock the Notifications