కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు - ఘాట్లు, వసతి ఇలా..!!

అఖండ గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ పుష్కరాల కోసం కేంద్రం ఇప్పటికే నిధులు విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాట్ల పై కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు ప్రాధమికంగా ఏర్పాట్ల ఖర్చు పైన ఒక అంచనాకు వచ్చింది. గత అనుభవాల ను పరిగణలోకి తీసుకొని ఈ సారి ఘాట్లు, వసతి ఏర్పాట్లలో ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముందస్తుగానే వచ్చే భక్తులకు సమాచారం ఇవ్వాలని డిసైడ్ అయింది.

పుష్కరాల కోసం
అఖండ గోదావరి పుష్కరాలు 2027ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. గోదావరి పుష్కరాల ముహూర్తం ఖరారైంది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్దం చేసింది. అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు.

AP Government begins works for Godavari Pushkarams 2027 funds allocation

ప్రణాళికలు సిద్దం
గోదావరి పుష్కరాల కోసం ప్రస్తుతం 17 ఘాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిషికేషన్‌, ఐకానిక్‌ టూరిజం సైట్‌ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు.

వసతి కోసం
కుంభమేళ, రామ ప్రతిష్ట తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కర ఘాట్ల వద్ద ఉచిత మెడికల్ క్యాంపులు, భక్తుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే భక్తులకు అనుగుణంగా బఫర్ జోన్​ను ప్రతిపాదిస్తున్నారు. స్టే హోమ్ అనే ప్రతిపాదనతో రెండు రోజులు విడిది ఉండేలాగా ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తున్నారు. దీని కోసం స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+