ఏపీలో టీచర్లకు షోకాజ్ నోటీసులు ? సర్కార్ క్లారిటీ ఇదే..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా హాజరు నమోదుతో పాటు ఇందులో విఫలమైతే చర్యలు తీసుకునే పరిస్ధితి ఉండేది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే టీచర్లకు వీటి నుంచి విముక్తి కల్పిస్తామని ఎన్నికల సమయంలో నేతలు హామీలు ఇచ్చారు. కానీ తాజాగా టీచర్లకు ఇదే అంశంపై కూటమి సర్కార్ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు వైసీపీ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
ఇందులో ఏపీలో కూటమి ప్రభుత్వం టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు, ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానంలో హాజరు నమోదు చేయని టీచర్లపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు ఈ పోస్టులో వైసీపీ పేర్కొంది. ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానాన్ని నిర్ద్వందంగా, కఠినంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలిపింది. దీంతో కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నట్లు ఈ పోస్టులో తెలిపింది.

దీనిపై ఇవాళ స్పందించిన కూటమి ప్రభుత్వం ఎక్స్ లో ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. వైసీపీ పెట్టిన పోస్టును ట్యాగ్ చేస్తూ దీనికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపింది. ఇది అవాస్తవమని క్లారిటీ ఇచ్చేసింది. తద్వారా తాము టీచర్లకు ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానం విషయంలో ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదని చెప్పకనే చెప్పేసింది. దీంతో ఇదంతా వైసీపీ ఫేక్ ప్రచారమే అని తేలిపోయింది.
దీనికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. ఇది అవాస్తవం. pic.twitter.com/G5ekipKy6c
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) July 9, 2024












Click it and Unblock the Notifications