Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మే 9వ తేదీ నుంచి వేసవి సెలవులు - జూలై 4 నుంచి తిరిగి ప్రారంభం : కాలేజీలకు ఇలా..!!

ఏపీలో విద్యా సంస్థలకు వేసవి ..తిరిగి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మే 9వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే రెండు నెలల సెలవుల అనంతరం జూలై నాలుగో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. సాధారణంగా ప్రతీ ఏటా ఏప్రిల్ మూడో వారంలో పరీక్షలు పూర్తి చేసి సెలవులు ప్రకటించే వారు.

అదే విధంగా జూన్ రెండో వారం లేదా మూడో వారం నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభిచటం జరిగేది. అయితే, ఈ సారి కరోనా కారణంగా విద్యాసంవత్సర క్యాలెండర్ లో మార్పులు చేసారు. 2020లో నవంబర్‌ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కాగా.. గతేడాది ఆగస్టు రెండో వారం నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలైంది.

క్యాలెండర్ - సిలబస్ లో మార్పు

క్యాలెండర్ - సిలబస్ లో మార్పు

క్యాలెండర్ లో మార్పుతో పాటుగా పాఠ్యాంశాల సిలబస్‌ను కొంతమేర తగ్గించారు. దీంతో ఈ ఏడాది మేలో వేసవి సెలవులు ప్రకటించి, జూలైలో కొత్త విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టాలని విద్యాశాఖ ప్రతిపాదనలు చేసింది. పదో తరగతి విద్యార్థులకు మరో పది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ పరీక్షల విభాగం పలు సూచనలు చేసింది.

ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండేళ్లుగా పరీక్షలు పూర్తి స్థాయిలో జరగకుండానే పై తరగతులకు వెళ్లడంతో ఈసారి కొంత మేర ఒత్తిడి ఎదుర్కోనున్నారు.

సెలవులు - కొత్త విద్యా సంవత్సరం ఇలా

సెలవులు - కొత్త విద్యా సంవత్సరం ఇలా

పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 27వ తేదీ నుంచి మే తొమ్మిదో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు ఉంటాయి. విద్యార్థులు తమకు ఇచ్చే 24 పేజీల బుక్‌లెట్‌లోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

గతంలోలా అదనంగా పేపర్లు ఇవ్వడం ఉండదు. ఈ ఏడాది నుంచి రెగ్యులర్‌, ఓపెన్‌, వొకేషనల్‌ విద్యార్థులకు ఓఎంఆర్‌ బార్‌ కోడ్‌ ఉండే షీట్లతో జవాబుపత్రాలు అందిస్తారు. కనుక ముందుగా అన్ని వివరాలు సరిచూసుకున్నాకే పరీక్ష రాయడం ప్రారంభించాలి.

కాలేజీలకు సెలవులు ఖరారు

కాలేజీలకు సెలవులు ఖరారు

ప్రీ ఫైనల్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు కొన్ని జిల్లాల్లో యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడంతో ఫైనల్‌ పరీక్షల కోసం మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలు మే 9న పూర్తవగానే వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్‌-2(వార్షిక పరీక్షలు) పరీక్షలను ఏప్రిల్‌ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు- చేశారు.

ఈ పరీక్షలు పూర్తి కాగానే వారికి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. మరోవైపు జూనియర్‌ కాలేజీలకు మే 25 నుంచి జూన్‌ 20 వరకు సమ్మర్‌ హాలిడేస్‌ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించిన్నట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+