వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణంరాజు కోసం జగన్ కీలక నిర్ణయం: మొగల్తూరులో రోజా - ప్రభాస్..!!

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సిని నటుడు..ఇటీవలే కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు గుర్తుగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్వగ్రామం మొగల్తూరులో ఆయన స్మారకం ఏర్పాటు పైన ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏపీ మంత్రులు మెగల్తూరు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ప్రభాస్ కోసం అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభకు వెళ్లిన హీరో ప్రభాస్​ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. అభిమానులకు చేయి ఊపుతూ ప్రభాస్‌ అభివాదం చేశారు.

సభకు ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు - పార్టీ నేతలు హాజరయ్యారు. కృష్ణం రాజు కుటుంబ సభ్యులను మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పరామర్శించారు. రాజకీయాల్లో, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఘనత కృష్ణం రాజు కే దక్కుతుందని రోజా నివాళి అర్పించారు. కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని..ఆయన తీరని లోటన్నారు. కృష్ణం రాజు సినిమాల్లో రెబల్ స్టార్, రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ గా అభివర్ణించారు. భౌతికంగా ఆయన దూరమైన ఆయన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ది ఎవ్వరూ మరువలేరని రోజా కొని యాడారు.

AP Government Decided to construct Krihsnam Raju Memorial in Mogalturu, minister Announces

కృష్ణం రాజు సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా మొగల్తూరు తీర ప్రాంతంలో రెండు ఏకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణ ప్రకటించారు. మొగల్తూరు లో పుట్టి సినీరంగం, రాజకీయ రంగంలో కృష్ణం రాజు రాణించడం ఈ ప్రాంత వాసుల అదృష్టంగా అభివర్ణించారు. కృష్ణం రాజు గుర్తుగా తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తామని చెప్పారు. కృష్ణంరాజు లేని లోటు తీర్చలేనిదని నిమ్మల రామానాయుడు అన్నారు.

రాజకీయాల్లోనూ కృష్ణంరాజు తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. అవినీతి మరక లేకుండా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారన్నారు. ప్రతి గ్రామానికీ అభివృద్ధి నిధులు ఇచ్చారన్నారు. దిగింది. కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. దశ దిన కర్మను అక్కడే పూర్తిచేసిన కుటుంబ సభ్యులు.. ఆయన స్వగ్రామంలో సంస్మరణ సభ నిర్వహించారు.

English summary
AP Govt Annouces Krishnam Raju memorial to be construct At Mogalturu in two acers of land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X