నెలాఖరులోగా పీఆర్సీ -జీతాలు ఆలస్యం కావు : చర్చల డేట్స్ ఫైనల్- ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం హామీ..!!

దసరా సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 18,19 తేదీల్లో పిఆర్సీ,సీపీఎస్ రద్దు పై చర్చలు జరగనున్నాయి. ఉద్యోగులు నిరీక్షిస్తున్న పీఆర్సీ పైన ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా సీపీఎస్ పైన చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఇక నుంచి జీతాలు ఆలస్యం కావని భరోసా ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్ల పైన చర్చించటానికి సీఎంఓ అధికారులు ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించారు.

ఈ నెల 18, 19 తేదీల్లో పీఆర్సీపై చర్చలు

ఈ నెల 18, 19 తేదీల్లో పీఆర్సీపై చర్చలు

వారితో చర్చించే సమయంలో వారి డిమాండ్లను పూర్తిగా విన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ...అధికారులు సానుకూలంగా స్పందించారు. జగన్‌ సీఎం అయ్యాక ఉద్యోగుల ప్రాధాన్యం పెరిగిందని, ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉందని సజ్జల చెప్పుకొచ్చారు. సంక్షేమంలో తమ ప్రభుత్వం రెండు అడుగుల ముందే ఉందన్నారు. కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చిన్న చిన్న సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగుల ను రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు.

నెలాఖరు కల్లా పీఆర్సీ అమలుపై నిర్ణయం

నెలాఖరు కల్లా పీఆర్సీ అమలుపై నిర్ణయం

జగన్ అలా చేయరని స్పష్టం చేసారు. ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 1.30 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఉద్యోగుల సమస్య ఏది ఉన్నా వినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రెండు సంవత్సరాలు నుంచి కరోనా ప్రభావం ఉందని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని చెప్పుకొచ్చారు. కొంత ఒత్తిడి ఉందని వివరించే ప్రయత్నం చేసారు. ఉద్యోగులు కోరుతున్న పిఆర్సీ,సీపీఎస్ హామీలపై చర్చలు జరుగుతున్నాయని సజ్జల వెల్లడించారు.

ఇతర డిమాండ్స్ పైన వచ్చే నెలాఖరులోగా పరిష్కారం

ఇతర డిమాండ్స్ పైన వచ్చే నెలాఖరులోగా పరిష్కారం

పిఆర్సీ నెలాఖరు నాటికి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ఇఛ్చామని గుర్తు చేసారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పారు. ఈ రోజు జరిగిన సమావేశం అధికారికంగా నిర్వహించలేదని .. సీఎస్ త్వరలోనే ఉద్యోగ సంఘాలతో చర్చిస్తారని సజ్జల హామీ ఇచ్చారు. మిగిలిన డిమాండ్స్ పై వచ్చే నెల ఆఖరికి స్పష్టత వస్తుందన్నారు. అదే విధంగా ప్రధానంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావిస్తున్న అంశమైన జీతాలు ఆలస్యం పైనా సానుకూలంగా స్పందించారు.

జీతాలు ఆలస్యం కాకుండా హామీ

జీతాలు ఆలస్యం కాకుండా హామీ

జీతాలు ఆలస్యం అవుతున్నాయని..భవిష్యత్ లో ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. కొందరితో కాదు..అన్ని సంఘాల నేతలతో చర్చిస్తున్నామని సజ్జల స్పష్టం చేసారు. ఉద్యోగ సంఘాలు..ఉద్యోగులకు ప్రభుత్వం పైన ఎటువంటి అపోహలు అవసరం లేదని తేల్చి చెప్పారు. దీంతో.. ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసి...చివరక సీఎం పీఆర్సీ పైన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం..మేలు చేస్తామని హామీ

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం..మేలు చేస్తామని హామీ

ఈ నెల 18,19 తేదీల్లో పిఆర్సీ,సీపీఎస్ రద్దు పై సీఎస్ తో చర్చలు జరుగుతాయని ఉద్యోగ సంఘ నాయకులు సైతం వెల్లడించారు. హెల్త్ కార్డుల విషయం లో నెట్ వర్క్ హాస్పిటల్స్ ,ఉద్యోగ సంఘాల తో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని బొప్పరాజు వేంకటేశ్వర్లు వివరించారు. మరణించిన ఉద్యోగులు,ఉపాధ్యాయులు పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరామన్నారు.

ప్రతి జిల్లాలో మేళా నిర్వహిస్తామని చెప్పారన్నారు. ఉద్యోగుల డిమాండ్స్ పై ప్రభుత్వం తో రాజేపడేది లేదని స్పష్టం చేసారు. తమ సమస్యలు పరిష్కరించక పోతే మా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని..సమస్యల పరిష్కారం లో అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి రావాలి బొప్పరాజు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+