విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆప్ఘన్ హెరాయిన్ తో సంబంధం లేదు-ఏపీ సర్కార్ ప్రకటన- అంతా పచ్చగోలేనన్న పేర్నినాని

|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన హెరాయిన్ పై ఏపీలో రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ హెరాయిన్ రవాణా షిప్ మెంట్ పై విజయవాడ అడ్రస్ ఉండటంతో దీనిపై విమర్శల హోరు కొనసాగుతోంది. ఇదే క్రమంలో వైసీపీ ప్రభుత్వానికి హెరాయిన్ లింకుల్ని అంటగడుతూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలతో రచ్చ పెరుగుతోంది. దీనిపై ఇవాళ ఏపీ ప్రభుత్వం స్పందించింది.

విజయవాడకు ఆప్ఘనిస్తాన్ హెరాయిన్ అక్రమ రవాణా జరుగుతుండగా పట్టుకున్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలపై సమాచారశాఖ మంత్రి పేర్నినాని స్పందించారు. చెన్నై లో స్థిర నివాసం ఉండే వ్యక్తి విజయవాడలో అడ్రస్ పెట్టుకుని మత్తుమందు లతో పట్టుబడ్డాడని, దీనిపై తెలుగు తమ్ముళ్లు గ్రామ సింహాలకు పోటీగా గొడవ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ పై అక్కసుతో రాజకీయ కక్ష కోసం రాష్ట్రంపై విమర్శలు చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. వీళ్ళు ఆంధ్రా తాలిబన్లలా ఉన్నారన్నారు.

ap government denied state links with afghan heroin issue, minster perni nani counter tdp remarks

టీడీపీ విమర్శల్ని ప్రస్తావిస్తూ... 72 వేల కోట్లు డ్రగ్స్ ఎక్కడ... తాడేపల్లి ప్యాలెస్ లోనా అని ఒకడు అడుగుతున్నాడని పేర్నినాని మండిపడ్డారు. సోషల్ మీడియా లో తప్పుడు రాతల వల్ల ఉపయోగం లేదన్నారు. పచ్చ బ్యాచ్ కు చెందిన ఆకురౌడీ తుపాకీ గుళ్ళతో ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డాడని గతంలో టీడీపీ నేత పరిటాల సునీత రెండో కుమారుడి ఘటనను పేర్ని ప్రస్తావించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇంద్రకీలాద్రిపై క్షుద్రపూజలు నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంపైన ప్రేమ కంటే కులం కులం అని ప్రవర్తిస్తున్నారని పేర్ని మండిపడ్డారు. బ్రాహ్మణుల, ముస్లిం స్థలాలు కబ్జాలు చేసి భూ కబ్జాలకు అడ్డాగా మారి జగన్ పై విమర్శలు చేస్తున్నారని పేర్ని ఆరోపించారు.పాపాత్ములు పాపాలు చేసి గుజరాత్ లో పట్టుబడ్డ హెరాయిన్ పై మాట్లాడుతున్నారని టీడీపీ నేతల్ని విమర్శించారు.

మరోవైపు గుజరాత్ లోని ముంద్ర పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్ పై విజయవాడ అడ్రస్ ఉండటం మినహా ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే విజయవాడ పోలీసు కమిషనర్ కూడా ప్రకటించారు. అయినా టీడీపీ నేతల విమర్శలు మాత్రం ఆగడం లేదు. సోషల్ మీడియాలో అయితే ఈ విమర్శల దాడి మరీ తీవ్రంగా ఉంది. దీంతో ప్రభుత్వం ఇవాళ అధికారికంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా టీడీపీ విమర్శలు ఆగుతాయో లేక మరింత పెరుగుతాయో చూడాల్సి ఉంది.

English summary
ap minister perni nani on today given strong counter to tdp remarks over afghan heroin transport to vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X