పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 26 నుంచి ప్రతి శనివారం ఆధ్యాత్మిక యాత్ర..
పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ అందించింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వన్డే ఆధ్యాత్మిక ప్రయాణ పర్యాటక ప్యాకేజీనీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించనున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ ఆధ్యాత్మిక యాత్ర కేవలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దర్శనీయ ప్రదేశాలకు మాత్రమే. వారాంతంలో ఉమ్మడి జిల్లాలోని దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఈ వన్డే టూర్ ప్యాకేజీనీ ఏపీ పర్యాటకశాఖ రూపొందించారు. మొత్తం ఆరు పుణ్యక్షేత్రాల మీదుగా ఈ ఆధ్యాత్మిక యాత్ర కొనసాగనుంది. ఇందులో భాగంగా కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను సందర్శించొచ్చు. ఈ వన్డే టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రతి శనివారం ఈ ఆలయాల మీదుగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు.

సందర్శనీయ ప్రదేశాలు.
అక్టోబర్ 26 నుంచి ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అయితే, పర్యాటకుల డిమాండ్‌ను అనుసరించి ఆదివారం కూడా ఈ బస్సులను నడిపే ఆలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి శనివారం రోజు రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్ వద్ద నుంచి ఉదయం ఆరు గంటలకు ఈ బస్సులు ప్రారంభమవుతాయి.
మొదటగా కోరుకొండలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సందర్శనం ఉంటుంది. ఆ తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం, అనంతరంపాదగయ తీర్థంగా పేరొందిన పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయ సందర్శనకు తీసుకెళ్తారు. అక్కడినుండి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం భోజనం తర్వాత ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయ సందర్శనకు తీసుకువెళ్తారు.
వన్డే టూర్ ధరలు..
ఆ తర్వాత కోనసీమ తిరుపతిగా పేరొందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. అక్కడి నుండి రాత్రి ఏడు గంటలకు రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్దకు వెళ్తారు. అక్కడే గోదావరి జలహారతి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తారు. ఈ కార్యక్రమం పూర్తైన వెంటనే రాత్రి ఏడున్నరకు రాజమండ్రిలోని ఏపీటీడీసీ కార్యాలయం దగ్గరికి పర్యాటకులు చేరుకుంటారు. దీంతో ఈ వన్డే టూర్ ముగుస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి. చిన్నారులకు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. పెద్దలకు రూ.1000 చొప్పున చెల్లించాలి. బస్సులో మొత్తం 18 మంది ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications