గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ !!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులకు త్వరలోనే ప్రమోషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటగా మారింది. ఉద్యోగుల సేవా నియమాలు, పనితీరును పరిశీలించి దశలవారీగా పదోన్నతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డుగా పేర్ల మార్పు..

కాగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను 'స్వర్ణ గ్రామం', 'స్వర్ణ వార్డు' కార్యాలయాలుగా మార్చే బిల్లును ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టారు. అందుకు గాను సభ్యులు సమ్మతి తెలపడంతో ఆమోదం పొందింది. ఈ నిర్ణయం ద్వారా గ్రామస్థాయిలో పరిపాలనను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పేర్లతో పాటు సేవల నాణ్యతను కూడా మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ap-government-good-news-to-ward-and-village-secretariat-employees-about-promotions-and-other-details

మండలిలో మంత్రి డోలా వివరణ..

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాష్ట్ర స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. ఈ కార్యాలయాల ద్వారా 'స్వర్ణాంధ్ర' లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యవస్థను తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ప్రత్యేక పర్యవేక్షణ విధానాన్ని అమలు చేసి సేవల నాణ్యతను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వైసీపీపై ఫైర్..

అలానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడానికి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గ్రామస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడానికి స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న YSR Congress Party ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని మంత్రి ఆరోపించారు. ముఖ్యంగా పంచాయతీలకు రావాల్సిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారని విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను తిరిగి విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+