జెత్వానీ కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం - వంశీతో సహా ఆ ముగ్గురిపై గురి..!!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మూడు కీలక కేసులను సీఐడీ విచారణ కు అప్పగించాలని నిర్ణయించింది. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసు తో పాటుగా సంచలనం సృష్టించిన సినీనటి కాదంబరీ జెత్వానీ కేసునూ సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీచేశారు. దీంతో, ఈ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ముఖ్యలకు ఉచ్చు బిగుస్తోంది.
సీఐడీకి అప్పగింత
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు ప్రధాన కేసులను సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించింది. వైసీపీ హయాంలో చంద్రబాబు నివాసంతో పాటుగా టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడుల కేసుల పైన ప్రస్తుతం విచారణ సాగుతోంది. దీంతో పాటుగా నటి జెత్వానీ కేసు ను సీఐడీకి అప్పగించింది. వైసీపీ హాయంలో నాటి సీఎంఓ, డీజీపీ కార్యాలయంతో పాటుగా విజయవాడ లో పని చేసిన కీలక పోలీసు అధికారుల పై అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసు విచారణ కొనసాగుతోంది. పోలీసు అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇందులో వైసీపీ నేత విద్యా సాగర్ ను పోలీసులు విచారించారు.

ప్రభుత్వ నిర్ణయం వెనుక
ఇప్పుడు ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా గన్నవరం టీడీపీ కార్యాలయం..చంద్రబాబు నివాసం దాడులను కూటమి ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది.ఈ కేసుల తీవ్రత..వాటి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కేసులను సీఐడీకి బదిలీ చేయాలనే ఈ నిర్ణయంతో ఇందులో ప్రమేయం ఉన్న వారికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న నేతలను పోలీసులు విచారించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన అభియోగాలు ఉన్నాయి. మిగిలిన వారు సుప్రీంకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వారి విచారణకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
సీఐడీ విచారణతో
అదే విధంగా చంద్రబాబు ఇంటి పైన దాడి కేసులో ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేశ్ ను పోలీసులు విచారించారు. ఈ రెండు కేసుల్లో వైసీపీకి చెందిన క్రిష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. పార్టీ ముఖ్య నేత సజ్జల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఇక, ఇప్పుడు ఈ మూడు కేసులు సీఐడీకి అప్పగించటంతో ఇందులో ప్రమేయం ఉందని భావిస్తున్న వైసీపీ నేతల మెడకు ఉచ్చు ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా జెత్వానీ కేసులో వైసీపీ హయాంలో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్య నేతలను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, సీఐడీ నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి!











Click it and Unblock the Notifications